వర్షాకాలం అంటేనే రోగాల మయం. జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, న్యుమోనియా వంటి ఎన్నో సీజనల్ వ్యాధులు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.
వీటికి తోడు చర్మ సమస్యలు మరింత తలనొప్పిని పుట్టిస్తాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలోనూ మీ చర్మం నిగారింపుగా మెరిసిపోవడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే కిందకు ఓ లుక్కేసేయండి.
సాధారణంగా చాలా మంది వర్షాకాలమే కదా అని వాటర్‌ను సరిగ్గా తాగరు.
ఇది మీ ఆరోగ్యాన్నే కాదు చర్మ సౌందర్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది.కాలం ఏదైనా రోజుకు ఎనిమిది గ్లాసుల వాటర్ తప్పకుండా తీసుకోవాలి.
తద్వారా వివిధ రకాల చర్మ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
అలాగే చర్మం నిగారింపుగా మెరవాలంటే శుభ్రత ఎంతో ముఖ్యం.వర్షాకాలంలో చర్మం క్రిములు, కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వాల్సి వస్తుంది.అందుకే ఉదయం, సాయంత్రం తప్పకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
రోజుకు మూడు నుండి నాలుగు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి.
కొందరు వర్షాకాలంలో సన్ స్క్రీన్‌ను ఎవైడ్ చేస్తుంటారు.కానీ, చర్మ కణాలు దెబ్బ తినకుండా ఉండాలంటే వర్షాకాలంలోనూ స్కిన్‌కు సూట్ అయ్యే సన్ స్క్రీన్ ను ఉపయోగించాలి.
ఈ మాన్ సూన్ సీజన్లో మేకప్‌ను వీలైనంత తక్కువగా వేసుకోవాలి.
మేకప్‌ను పూర్తిగా ఎవైడ్ చేసి తేలికపాటి మాయిశ్చరైజర్స్ వాడినా చర్మానికి ఎంతో మేలని అంటున్నారు.ఒకవేళ మేకప్ ప్రోడెక్ట్స్‌ను వాడాలి అనుకుంటే వాటర్ ప్రూఫ్ వి ఎంచుకోవాలి.
ఇక ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రిమ్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.డైట్‌లో తేలికగా జీర్ణం అయ్యే పోషకాహారాన్ని చేర్చుకోవాలి. గ్రీన్ టీ, మింట్ టీ వంటివి రోజూ తీసుకోవాలి.తద్వారా చర్మ ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.