టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు ఈ సినిమా విడుదల కాకముందుఫ్యామిలీతో కలిసి విహరి యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే.సినిమా విడుదలైన తర్వాత కూడా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన మహేష్ బాబు అమెరికా, యూరప్ లో చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్నాడు.
కాగా మహేష్ బాబు కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కాస్త సమయం దొరికితే చాలు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ప్రస్తుతం మహేష్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట లాంటి సినిమాలలో నటించి మంచి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు మహేష్ బాబు.వరుసగా సూపర్ హిట్ లను అందుకోవడంతోపాటు నిర్మాతల కూడా మంచి అధిక లాభాలు తెచ్చిపెడుతున్నాడు.
అయితే ఒకవైపు హీరోగా నటించిన మరొకవైపు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు మహేష్.ఇటీవల మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన మేజర్ సినిమా విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
కాగా మహేష్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్‌తో చేయనున్నారు.ఆ సినిమా తర్వాత రాజమౌళితో కలిసి ఒక సినిమాను చేయనున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది.తాజాగా మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే మహేష్ అమెరికాలో ఓ ప్రాపర్టీని కొన్నాడట.ఓ యాబై కోట్లు ఇన్వెస్ట్ చేశారని తెలుస్తుండగా, ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర సలహాతోనే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.