తానొక డాక్టర్ అయ్యుండి యాంకర్ గా టర్న్ అయ్యింది తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్.రౌడీ బోయ్స్ లో హీరోయిన్ అనుపమకి ఫ్రెండ్ రోల్ చేసిన కోమలి కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన సెబాస్టియన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది.ఇక ఈ సినిమా తర్వాత కోమలి ప్రసాద్ వెబ్ సీరీస్ లతో అలరిస్తుంది.అయితే సినిమాల కన్నా అమ్మడు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటుంది.సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ ని అలరిస్తుంది.
అంతేకాదు తన గ్లామర్ సైడ్ కూడా సోషల్ మీడియాలో చూపించేస్తుంది.కోమలి ప్రసాద్ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అలరిస్తున్నాయి.టాలెంట్ ఉన్న ఈ తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయాల్సిందే అని ప్రేక్షకులు అంటున్నారు.కోమలి ప్రసాద్ తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం శశివదనే సినిమా చేస్తున్న అమ్మడు వెబ్ సీరీస్, సినిమాలు ఏవైనా సరే ఓకే అనేస్తుంది.తెలుగు అమ్మాయి కోమలికి కొద్దిగా బూస్టింగ్ ఇస్తే ఇక్కడ స్టార్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది.
అలాంటి సరైన ఛాన్స్ కోసమే కోమలి ప్రసాద్ ఎదురుచూస్తుంది.