తెలుగు బిగ్బాస్ ముగింపుకు వచ్చేసింది.ఈ సీజన్ మొదట్లో కాస్త మంచి రేటింగ్ వచ్చినా రాను రాను రేటింగ్ మరీ దారుణంగా పడిపోయింది.
దాంతో ఇంటి సభ్యుల మద్య గొడవలు పెంచేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న క్రియేటివ్ టీమ్ సఫలం అవుతున్నట్లుగా అనిపిస్తుంది.బిగ్బాస్ నిర్వాహకులు అఖిల్ ను సీక్రెట్ రూంకు తీసుకు వెళ్లి వీకెండ్ ఎపిసోడ్ లో పంపించారు.
నేను మళ్లీ లోనికి వస్తాను అనే నమ్మకంతో బయటకు వెళ్లాను అంటూ ఆ సమయంలో అఖిల్ చెప్పాడు.అదే విషయాన్ని అభిజిత్ చెప్తే మాత్రం ఒప్పుకోవడం లేదు.

నువ్వు మళ్లీ వస్తావనే నమ్మకంతోనే వెళ్లావు, అందుకే నిన్ను నీవు డిఫైన్ చేసుకోలేదు అంటూ అభిజిత్ అంటే నేను అలా అనుకోలేదు అంటాడు.ఇక నిన్న ఎలిమినేషన్ నామినేషన్ పక్రియలో కూడా అదే చర్చ జరిగింది.నేను బయటకు పోయిన తర్వాత నా గురించి బాధ పడకున్నా పర్వాలేదు కాని నవ్వడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదు అంటూ అఖిల్ ఓ రేంజ్ లో రెచ్చి పోయి అభిజిత్ ను నామినేట్ చేశాడు.బిగ్బాస్ నన్ను మేకలా పిలిచాడు.
నాకు బూస్టింగ్ ఇచ్చి పులిలా మార్చాడు.నేను పులిని అయ్యాను అంటూ అఖిల్ తనకు తానుగా ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది.

అఖిల్ పులి డైలాగ్ కు అభిజిత్ స్పందిస్తూ మేక ఎప్పుడు పులి కాదు బాబు బలైతది అంటూ అఖిల్ గాలి మొత్తం తీశాడు.ఇద్దరి మద్య నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా సాగింది.అఖిల్ కెప్టెన్ అవ్వడం వల్ల సేవ్ అయ్యాడు.ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్లో హారిక మరియు సోహెల్లు కూడా చాలా గొడవ పడ్డారు.ఆ తర్వాత సోహెల్ మరియు అభిజిత్ ఇంకా లాస్య మరియు అరియానాలు కూడా కాస్త ఎక్కువగానే గొడవ పడ్డారు.మొత్తానికి ఎనిమిది మందిలో ఆరుగురు నామినేట్ అయ్యారు.
వారు అభిజిత్, లాస్య, హారిక, అరియానా, మోనాల్ మరియు సోహెల్.వీరు ఆరుగురిలో ఈ వారం వెళ్లి పోయేది ఎవరు అనేది చూడాలి.