తెలంగాణాలో ఈసారి ఎలా అయినా సరే టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయాలని విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాటానికి దిగుతున్నాయి.ఎవరికీ వారు విడి విడిగా ఎన్నికల బరిలోకి దిగితే నష్టపోవడం ఖాయం అని అందుకే అందరం కలిసే కేసీఆర్ ని ఎదుర్కొందామని మాహాకూటమిగా ఏర్పడేందుకు అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి.
కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, పలు ప్రజాసంఘాలు కలిసి మహాకూటమిగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ పార్టీలన్నీ ఇప్పటికే ఒక అవగాహన కు వచ్చేసాయి.
ఇక మిగిలిందల్లా సీట్ల సర్దుబాటు మాత్రమే.

ఇంతవరకు బాగానే ఉన్నా… కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కొచ్చి పడింది అదే సీట్ల సర్దుబాటు.
సీపీఐ, తెలంగాణ జనసమితి, టీడీపీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై కాంగ్రెస్ పెద్దలు తర్జనభర్జనలు పడుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ కూడా సుమారు 30 స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది.
దాదాపుగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న సీట్లనే ఆ పార్టీ కోరుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో టీడీపీ కోరుతున్న స్థానాలు.అభ్యర్థుల లిస్ట్ కాంగ్రెస్ అధిష్టానానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అందించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ మాత్రం టీటీడీపీకి 30 సీట్లు ఇవ్వదనీ అందులో ఎన్నోకాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.టీడీపీ తరపున బరిలోకి దిగేందుకు ఆశవాహులు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సుల కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు.
ఎలాగైనా టికెట్ సంపాదించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.అయితే.బాబు మాత్రం ఈ బాధ్యతను ఎల్ రమణకే ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ కి అందిన టీడీపీ అభ్యర్థుల వివరాల్లో 19 మంది పేర్లు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి.
రాజేంద్రనగర్( ఎమ్ భూపాల్ రెడ్డి – రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు),
శేరిలింగంపల్లి మండవ వెంకటేశ్వరరావు – మాజీ మంత్రి/ మొవ్వ సత్యనారాయణ),
కూకట్ పల్లి( శ్రీనివాసరావు – కార్పొరేటర్),
కంటోన్మెంట్ ( ఎం.ఎన్.శ్రీనివాసరావు – గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు),
సికింద్రాబాద్( కూన వెంకటేష్ గౌడ్),
ఉప్పల్( వీరేందర్ గౌడ్),
ఖైరతాబాద్ ( బి.ఎన్.రెడ్డి – టీఎన్ టీయూసీ అధ్యక్షుడు),
దేవరకద్ర( రావుల చంద్రశేఖర్ రెడ్డి – మాజీ ఎమ్మెల్యే – మాజీ ఎంపీ),
మక్తల్ ( కొత్తకోట దయాకర్ రెడ్డి – మాజీ ఎమ్మెల్యే’
మహబూబ్నగర్- చంద్రశేఖర్ (మాజీ ఎమ్మెల్యే),
కోరుట్ల ( ఎల్ .రమణ – టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు),
పరకాల/ వరంగల్ వెస్ట్ ( రేవూరి ప్రకాష్ రెడ్డి),
హుజూరాబాద్( ఇనగాల పెద్దిరెడ్డి – మాజీ మంత్రి),
ఆర్మూర్( ఏలేటి అన్నపూర్ణ – మాజీ ఎమ్మెల్యే),
ఆలేరు( శోభారాణి – తెలంగాణ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు),
కోదాడ( బొల్లం మల్లయ్యయాదవ్),
ఖమ్మం(నామా నాగేశ్వరరావు – మాజీ ఎంపీ),
మిర్యాలగూడ( శ్రీనివాస్ -వ్యాపార వేత్త ),
సత్తుపల్లి( సండ్ర వెంకట వీరయ్య – తాజా మాజీ ఎమ్మెల్యే).