దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాను కలిసిన తెలంగాణ ఎంపీలు .

ఈ సందర్భంగా వాడి వేడిగా జరిగిన చర్చలలో ఏడేళ్లు గడుస్తున్నా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికి మంజూరు కాకపోవడం గురించి, శంషాబాద్ ఎంఎంటిఎస్ రైల్ ప్రాజెక్ట్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బులెట్ రైళ్ల ఏర్పాటు, అహ్మదాబాద్ ముంబయి బులెట్ రైలు మొదలైన అంశాల పై చర్చించినట్లు ఎంపీలు తెలిపార .రెండేళ్లకు ఒకసారి కాకుండ ప్రతి మూడు నెళ్లకు ఒకసారి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయాలని సూచించినట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆరెస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.

 Telangana Mps Meet South Central Railway Gm Gajanan Mallya ..gajanan Mallya,tela-TeluguStop.com

జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ కరోన కారణంగా సమావేశాలు ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు.కానీ కరోన కారణంగా రైళ్ల రాకపోకలు లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతానికి కరోన కారణంగా ఆగిపోయిన 85శాతం సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొన్ని ప్రాజెక్టుల పనులు ఆలస్యంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.మేం సొంతంగా పూర్తి నిధులతో మరి కొన్ని ప్రాజెక్టులు కడుతున్నామని వివరించారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube