అమెరికాలో స్థిరపడిన ఎంతోమంది భారతీయులు కేవలం ఉద్యోగాలు మాత్రమే లక్ష్యంగా కాకుండా వ్యాపార రంగంలో సైతం తమ సత్తా చాటుకుంటున్నారు.కొందరు భారతీయ వంటకాల రుచులతో హోటల్స్ పెడుతుంటే, మరికొందరు తమకి వచ్చిన రీతిలో బిజినెస్ లు పెడుతున్నారు.
అయితే ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్స్ కి అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వంటలకి అక్కడ ఫ్యాన్స్ ఎక్కువే.ఈ క్రమంలోనే.
హైదరాబాదు లో ప్రముఖ సంస్థ అయిన ప్రీమియం మిల్క్ షేక్స్ ఉత్పత్తుల మిల్క్‌షేక్స్ సంస్థ అమెరికా మార్కెట్లోకి ప్రవేశించింది.హైదరాబాద్‌కు చెందిన పుడ్ స్టార్టప్ సంస్థ మిల్క్‌షేక్స్ ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలోని తమ మొదటి స్టోర్ ని ప్రారంభించింది.
ఈ స్టోర్ ప్రారంభం సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు రాహుల్ తిరుమలప్రగడ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన విశేష స్పందన కారణంగా తొలి విడుత యూఎస్‌లో ప్రవేశించినట్లు తెలిపారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 80 స్టోర్లను నిర్వహిస్తున్న సంస్థ, వచ్చే నెల చివరి నాటికి 100కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.