‘కల్కి’ సినిమా షూటింగ్ సందర్భంగా హీరో రాజశేఖర్ గాయపడ్డారని, ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో … హీరో రాజశేఖర్ తన అభిమానులను ఉద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు.
తాను క్షేమంగా ఉన్నానని… ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందొద్దని… అవన్నీ వట్టి పుకార్లే అంటూ… రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా… వివరణ ఇచ్చారు.
తన ఆరోగ్యం గురించి అభిమానులు, బంధువుల నుంచి విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు.తన ఆరోగ్యం గురించి ఇంతగా ఆరా తీస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు.తన ఆరోగ్యం విషయంలో ఎలాంటి వదంతులు సృష్టించొద్దని కోరారు.
తాజా వార్తలు