నాకేం కాలేదు ... ఆ వార్తలపై హీరో రాజశేఖర్ వివరణ !
TeluguStop.com
‘కల్కి’ సినిమా షూటింగ్ సందర్భంగా హీరో రాజశేఖర్ గాయపడ్డారని, ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో .హీరో రాజశేఖర్ తన అభిమానులను ఉద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు.
తాను క్షేమంగా ఉన్నానని.ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందొద్దని.
అవన్నీ వట్టి పుకార్లే అంటూ.రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా.
వివరణ ఇచ్చారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తన ఆరోగ్యం గురించి అభిమానులు, బంధువుల నుంచి విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
తన ఆరోగ్యం గురించి ఇంతగా ఆరా తీస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు.తన ఆరోగ్యం విషయంలో ఎలాంటి వదంతులు సృష్టించొద్దని కోరారు.