అందరూ గప్ చిప్ ! టీడీపీ ని ఎదుర్కునేది ఎవరు ?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తరువాత బాగా బలహీనపడినా ఆ తరువాత మాత్రం కాస్త పుంజుకుంది.

ప్రతి విషయం పైన రాద్ధాంతం చేస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ సక్సెస్ అవుతూ వస్తోంది.

ఏపీ సీఎం గా జగన్ ప్రజలకు ఎంత మంచి పనులు చేస్తున్న, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, వాటి గురించి పెద్దగా చర్చ రాకుండా వాటిలోని లోపాలను టిడిపి అనుకూల మీడియా ద్వారా హైలెట్ చేసుకుంటూ, వైసీపీకి క్రెడిట్ రాకుండా చేయడంలో సక్సెస్ అవుతూ వస్తోంది.అయితే ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీకి పరాభవమే ఎదురైంది.

కాకపోతే వైసీపీకి పూర్తిస్థాయిలో ఆధిక్యం దక్కకుండా చేయగలిగింది.దీనంతటికీ కారణం వైసీపీ నేతల మౌనమే కారణంగా తెలుస్తోంది.

కేవలం కొంత మంది మంత్రులు, సలహాదారులు మాత్రమే ఏదైనా విషయంపై స్పందిస్తున్నారు తప్ప, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కీలకమైన నాయకులు ఎవరు ఏ విషయంపైన స్పందించడం లేదు .నియోజకవర్గాల వారీగా టిడిపి విమర్శలు చేస్తూ సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్న, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు సైతం తిరిగి గట్టిగా సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.కేవలం ఒకటి రెండు చోట్ల ఈ పరిస్థితి ఉంది అనుకుంటే పర్వాలేదు కానీ , దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement

దీంతో అధికార పార్టీ హడావుడి కంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.ఏ దశలోనూ ప్రభుత్వానికి మైలేజ్ రాకుండా చేయడంలో టిడిపి సక్సెస్ అవుతూ వస్తోంది.

ఇక జనసేన, బిజెపి సైతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.

వైసీపీలో ప్రతి నియోజకవర్గంలోనూ రెండు గ్రూపులు ఉండడం, ఒకరికి క్రెడిట్ లేకుండా మరొకరు ప్రయత్నించడం వంటి కారణాలతో సొంతింటిని చక్కదిద్దుకునేందుకే సమయం అంత వెచ్చించాల్సిన పరిస్థితి.ఇక పార్టీ అధిష్టానం నుంచి విలువైన సూచనలు రాకపోవడం, ఎవరు ఏ విషయంపై మాట్లాడాలన్నా, అధిష్టానం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండడం, ఇలా ఎన్నో కారణాలతో వైసిపి ఎమ్మెల్యేలు నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇవన్నీ వైసీపీకి ఇబ్బందికరంగా , టీడీపీ కి వరంగా మారాయి.

అన్ని విషయాలూ జగన్ చూసుకుంటాడు లే అన్నట్టుగా వైసీపీ నాయకులు నిర్లక్ష్యం ప్రదర్శించడం కూడా ఈ పరిస్థితికి మరో కారణంగా కనిపిస్తోంది.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు