నన్ను చెప్పుతో కొట్టండి .నన్ను చెప్పుతో కొట్టండి అంటూ… చేతిలో చెప్పులు పెట్టి మరీ వేడుకుంటున్నాడు ఓ ప్రబుద్దుడు.
ఇప్పుడు వైరల్ గా మారిన ఈ న్యూస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే… తెలంగాణాలో ఇప్పుడు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది.ఎవరి వారు సరికొత్త రూట్లో ప్రజల్లో ఆదరణ పొందేందుకు తిప్పలు పడుతున్నారు.అయితే… ప్రముఖ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులంతా తమ పార్టీ మేనిఫెస్టోను చూపిస్తూ.తమ నాయకుడి హయాంలో జరిగిన అభివృద్ధి గురించో చెబుతూ.
అంతకు మించిన అభివృద్ధి జరగాలంటే తమ పార్టీనే గెలిపించాలంటూ ఓటర్ దేవుళ్లను వేడుకుంటున్నారు.

అయితే … స్వతంత్ర అభ్యర్థుల పరిస్థితి ఏంటి.? వాళ్లు ఏం చెప్పి ఓట్లు అడగాలి?.అందరిలాగే చేస్తే వాళ్లను ఓటర్లు ఎలా గుర్తుంచుకుంటారు?.అందుకే ఓ స్వతంత్ర అభ్యర్థి తన ప్రచార శైలినే మార్చేశారు.రాజీనామా పత్రాలు, చెప్పులు వెంటబెట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.ఆయన మరెవరో కాదు.జగిత్యాల జిల్లాలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకుల హన్మాండ్లు.
తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తనను చెప్పుతో కొట్టి మరీ పని చేయించుకోవాలంటూ ఓటర్లకు ఆకుల హన్మాండ్లు విజ్ఞప్తి చేస్తున్నారు.అందుకే ఇంటింటికీ తిరుగుతూ కరపత్రం, రాజీనామా పత్రంతో పాటు చెప్పులు కూడా పంచుతున్నారు.







