భారత ప్రధాని నరేంద్ర మోది( PM Narendra Modi ) తెలంగాణ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది. పార్లమెంట్ ఎన్నికలకు( Parliament Elections ) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో , ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ, బిజెపికి( BJP ) కలిసి వచ్చే విధంగా , మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునేలా ప్రధాని మోదీ ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణలోని 17 సీట్లలో దాదాపు పదికి పైగా స్థానాలను బిజెపి ఖాతాలో వేసుకునేలా పక్కా ప్రణాళికలను రచిస్తున్నారు.దీనిలో భాగంగానే మార్చి 4 , 5 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోది తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు.
నాలుగో తేదీన ఆదిలాబాద్ జిల్లాలో( Adilabad ) జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఐదో తేదీన సంగారెడ్డి జిల్లాలో( Sangareddy ) జరిగే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు.కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలతో పాటు, పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు.మార్చి 4వ తేదీ ఉదయం మోది నాగపూర్ ఎయిర్ పోర్ట్ నుంచి 9.20 కి హెలికాఫ్టర్ లో బయలుదేరుతారు.
10 20 కి ఆదిలాబాద్ చేరుకుని 11 గంటల వరకు పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తారు.ఆ తరువాత 11:15 నుంచి 12 గంటల వరకు ఆదిలాబాద్ లో జరిగే బిజెపి భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.తరువాత ఆదిలాబాద్ నుంచి నాందేడ్ మీదుగా తమిళనాడు బయలుదేరి వెళ్తారు.తమిళనాడులో కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి 7:45 కు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.రాత్రి రాజ్ భవన్ లోనే బస చేయనున్నారు.ఆ తరువాత మార్చి 5న ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు.
ఉదయం 10 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి సంగారెడ్డి బయలుదేరి వెళ్తారు.10:45 నుంచి 11:15 వరకు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు తరువాత సంగారెడ్డిలో బిజెపి భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.ప్రధాని తెలంగాణ( Telangana ) పర్యటనలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు తెలంగాణ బిజెపి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.