జీవో 317 రద్దు చేయాలి - మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేసిన ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల బదిలీల లో తీవ్ర అభ్యంతరకరంగా మారిన జిఓ 317 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు సోమవారం శ్రీనగర కా లినికి  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.వివిధ జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఉదయం ఏడుగంటలకి మంత్రి నివాసం వద్దకు చేరుకుని ఆమె కోసం నిరీక్షించారు.

 Teachers Protest At Minister Sabitha Indra Reddy House Demands Cancellation Of G-TeluguStop.com

పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు మంత్రి నివాసం వద్దకు చేరుకోవడంతో బంజారా హిల్స్ పోలీసులు అని అదుపులోనికి తీసుకొని స్టేషన్కు తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్థానికతను పరిగణలోనికి తీసుకోకుండా చేస్తున్న బదిలీల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ‌‌. సీనియార్టీ ఆధారంగా జిల్లాలకు సంబంధం లేని వ్యక్తులను ఇతర జిల్లాలకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అశాస్త్రీయంగా చేపట్టిన బదిలీల కుటుంబాలు విశ్చినం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తాము పనిచేస్తున్న జిల్లాలో ఎలాంటి గ్రామీణ ప్రాంతానికైన వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా చేస్తున్న నిరసన పోలీసులు అడ్డుకోవడం విచారకరమని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి మానవతా దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల పట్ల అనైతికంగా వ్యవహరిస్తుంది అని టీచర్లు మండి పడ్డారు.

సోమవారం 317 go ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు పెద్ద యెత్తున మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటిని ముట్టడించారు.స్థానికంగా ఉన్న ఉద్యోగులకు అవకాశం ఇవ్వకుండా ఇష్టా రాజ్యంగా తప్పుడు లెక్కలతో బదిలీలు చేశారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు.

పుట్టి పెరిగిన జిల్లాలో కాదని 100 కిలోమీటర్ల కు పైగా దూరం లో ఉన్న దగ్గర బదిలీలు చేస్తే ఇక్కడ కుటుంబ సభ్యులకు, అక్కడ విద్యార్థులకు ఎలా న్యాయం చేయాలంటు ప్రశ్నించారు.ముఖ్యమంత్రి తమ సమస్యలను గుర్తించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Teachers Protest At Minister Sabitha Indra Reddy House Demands Cancellation Of GO317, GO317, Minister Sabitha Indra Reddy Housem Sabitha Indra Reddy, GO317, Govt Teachers, CM KCR, Telangana - Telugu Cm Kcr, Teachers, Sabithaindra, Telangana

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube