తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు సంచలన మార్పులతో అనుక్షణం రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.అయితే వచ్చే రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటి నుండే అనధికారికంగా ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పవచ్చు.
ఇక కెసీఆర్ కూడా బహిరంగంగా ఎన్నికలపై వ్యాఖ్యానించకున్నా తెర వెనుక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అన్న విషయంపై పూర్తి క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక హామీలయిన నిరుద్యోగ భృతి లాంటి హామీల అమలుపై అడుగులు పడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పాలనలో సంస్కరణల దిశగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో కలిసి ఒక కమిటీ వేసిన విషయం తెలిసిందే.
ఈ కమిటీ ఉద్దేశ్యమేమిటంటే ఎక్కడి ఉద్యోగులు అక్కడ సర్దుబాటు అయిన నేపథ్యంలో ఖాళీల భర్తీకి ఏ మాత్రం అవకాశం ఉంది అనే విషయంతో పాటు వీఆర్వో, వీఆర్ఏ లకు ఏ మేరకు పని ఒత్తిడి ఉంది అనే విషయంపై ఒక స్పష్టమైన అవగాహనకు రావడం ద్వారా ఇంకా ఖాళీల భర్తీకి ఎంత మేరకు అవకాశం ఉందనే విషయాన్ని పరిశీలిస్తారు .దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ ల భర్తీకి మార్గం సుగమం అయిందని చెప్పవచ్చు.
అయితే ప్రస్తుతం ఉద్యోగ నోటిఫికేషన్ ల కొరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు వేచి చూస్తున్న తరుణంలో ప్రభుత్వ స్పందన కొరకు పెద్ద ఎత్తున వేచి చూస్తున్న పరిస్థితి ఉంది.ఈ కమిటీ కూలంకషంగా ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇక ఒక స్పష్టమైన ప్రణాళిక అనేది ఒకటి బయటికి వచ్చే అవకాశం ఉంది.దాని ఆధారంగానే కెసీఆర్ భవిష్యత్ కీలక నిర్ణయాలు అనేవి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మరి రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.