కమ్మ, రెడ్డి.. బాబు, జగన్‌.. ఏపీలో రచ్చ రచ్చ!

ఆంధ్రప్రదేశ్‌లో కులానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే.సినిమా అయినా, రాజకీయం అయినా కులంతో విడదీయరాని బంధం ఉంది.

 Tdp Leaders Comments On Jagan Mohan Reddy-TeluguStop.com

అయితే ఈ మధ్య ఆ పిచ్చి మరికాస్త ఎక్కువైనట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా ఇటు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు, అటు వైసీపీ చీఫ్‌ జగన్మోహన్‌రెడ్డి మధ్య కుల పంచాయతీ గట్టిగానే నడుస్తోంది.

ఒకప్పుడు ఒక సామాజికవర్గం అని తిట్టుకునే వాళ్లు.కానీ ఇప్పుడు నేరుగా కులం పేరునే ప్రస్తావిస్తున్నారు.

Telugu Ap Depend Cast, Jagangive, Kapu Reddys, Tdp, Tdpjagan-

టీడీపీ అధికారంలో ఉన్నపుడు కేవలం కమ్మ వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ తరచూ విమర్శించేది.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి మొత్తం కమ్మ వాళ్ల చేతుల్లోనే ఉందని బహిరంగంగానే ఆ పార్టీ ప్రకటించింది.ఇటు టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది.జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మవాళ్లను పూర్తిగా అణిచేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు పబ్లిగ్గానే విమర్శిస్తున్నారు.

Telugu Ap Depend Cast, Jagangive, Kapu Reddys, Tdp, Tdpjagan-

పోలీసు శాఖలో కేవలం కమ్మ వాళ్లన్న ఒక్క కారణం చూపిస్తూ 70 మందికి పోస్టింగ్‌ ఇవ్వలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించగా.వెనుకబడిన వర్గాలకు జగన్‌ అవకాశాలు ఇవ్వడం లేదంటూ మరో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ విమర్శించారు.అటు మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి అయితే తనదైన స్టైల్లో జగన్‌ను మెచ్చుకుంటూనే చురకలంటించారు.

Telugu Ap Depend Cast, Jagangive, Kapu Reddys, Tdp, Tdpjagan-

నామినేటెడ్ పోస్టులన్నీ రెడ్లకే ఇచ్చినందుకు జగన్‌ను అభినందిస్తూనే.కక్ష సాధింపు చర్యలపై విమర్శలు గుప్పించారు.అయితే అదే సమయంలో టీడీపీ చీఫ్‌ చంద్రబాబు మాత్రం ఎప్పుడూ కేవలం కమ్మవాళ్లనే ప్రోత్సహించలేదని చెప్పడం గమనార్హం.

ఇలా చట్టసభలకు ఎన్నికైన వాళ్లే కమ్మ, రెడ్డి అంటూ కుల ప్రాతిపదికన విమర్శలు చేస్తుండటం ఏపీ రాజకీయాలను మరింత దిగజారుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube