ఎప్పుడు ఏ విషయంలో అయినా ముందడుగు వేయడం తప్ప, వెనకడుగు వేయడం జగన్ కు అస్సలు తెలియదు.కానీ జగన్ ఇప్పుడు ఆ వెనకడుగు వేసే సమయం వచ్చింది.
మొన్నటివరకు శాసనమండలిలో వైసీపీకి బలం తక్కువగా ఉంది.టిడిపికి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో శాసన సభలో ప్రవేశ పెట్టిన బిల్లులను మండలిలో బ్రేక్ వేసే వారు.
దీని కారణంగా ప్రభుత్వ నిర్ణయాలు అమలు ఆలస్యం అవడం, శాసనమండలిలో వాటిని నెగ్గించుకునేందుకు నానా తంటాలు పడటం వంటివి నిత్యకృత్యంగా మారడంతో ఏకంగా శాసన మండలి రద్దు చేసేందుకు జగన్ ప్రయత్నించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానులు బిల్లు శాసనమండలి లో వెనక్కి పంపడంపై ఆగ్రహం చెందిన జగన్ మండలి రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.
ఆ ప్రతిపాదన ఇంకా కేంద్రం వద్ద పెండింగ్ లోనే ఉండగా, ఇప్పుడు వైసీపీ నుంచి ఇప్పుడు మరో నలుగురు ఎమ్మెల్సీలు గా ఎన్నిక కాబోతున్నారు.ఈ నలుగురి పేర్లను ఖరారు చేసి గవర్నర్ కోటాలో నియమించేందుకు ఇప్పటికే రాజ్ భవన్ కు లిస్ట్ ను పంపించారు.
ఏ క్షణంలో అయినా దీనికి ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది.

జగన్ కు అత్యంత సన్నిహితులైన లేళ్ల అప్పిరెడ్డి, ఆర్ వి రమేష్, మోషేన్ రాజు, టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన తోట త్రిమూర్తులు పేర్లు ఫైనల్ చేశారు.
వీరు నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు టిడి జనార్ధన్, బీదా రవిచంద్ర, గౌరీ వాణి శ్రీనివాసులు, శకంతక మణి పదవీ కాలం పూర్తి కావడంతో వారి స్థానాల్లో ఈ వీరు ఎంపిక కాబోతున్నారు.వైసిపి బలం అనూహ్యంగా పెరగడంతో జగన్ ఢిల్లీ పర్యటన లో శాసనమండలి రద్దు అంశంపై కేంద్ర బిజెపి పెద్దల వద్ద ప్రస్తావించలేదు.
అసలు శాసనమండలి రద్దు అంశాన్ని ఇకపైనా ప్రస్తావించే అవకాశమూ లేదు.కేవలం మూడు రాజధానులు , పోలవరం ప్రాజెక్ట్, రఘురామ పై వేటు తదితర అంశాలపైనే చర్చించారు తప్ప , మండలి విషయాన్ని ప్రస్తావించలేదు.
ఒక వేళ కేంద్రం మండలిని రద్దు చేసేందుకు మొగ్గు చూపించినా జగన్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
.