Nara Chandrababu Naidu : కలసి పనిచేసి వైసీపీని చిత్తుగా ఓడించాలి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి.

 Chandrababu Sensational Comments Should Work Together And Defeat Ycp-TeluguStop.com

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీకి సిద్ధమయ్యింది. తెలుగుదేశం.

జనసేన.బీజేపీ పార్టీలు( Telugudesam Janasena BJP parties ) కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.

ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు.ఎలాగైనా 2024 ఎన్నికలలో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.

అందుకు తగ్గా రీతిలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.వారం రోజుల క్రితం వరకు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు ( Nara Chandrababu Naidu )రెండు రోజుల క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.

దీంతో 2014 మాదిరిగా 2024 ఎన్నికలలో గెలవాలని భావిస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా అస్సలు పొత్తులు ఎందుకు పెట్టుకోవలసి వచ్చింది అన్నదానిపై.సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు కోసం మూడు పార్టీలు చేతులు కలిపాయని వ్యాఖ్యానించారు.దీంతో క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలు కలసి విజయమే లక్ష్యంగా పనిచేయాలి.

వాడవాడలో మూడు జెండాలు కలిసి సాగాలి.వైసీపీ పార్టీని( YCP party ) చిత్తుచిత్తుగా ఓడించాలి.

జగన్ అక్రమాలనే నమ్ముకున్నారు.ఎన్నికల షెడ్యూల్ వచ్చాక వైసీపీ ఆగడాలు సాగవు.

అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube