Bandaru Satyanarayanamurthy : రాజకీయాలకు టీడీపీ నేత బండారు సత్యనారాయణ వీడ్కోలు..!!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ( Former minister Bandaru Satyanarayanamurthy )రాజకీయాలకు వీడ్కోలు పలికారు.విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ప్రకటన చేశారు.

 Bandaru Satyanarayanamurthy : రాజకీయాలకు టీడీపీ-TeluguStop.com

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పిన బండారు సత్యనారాయణ రాజకీయంగా ఇదే తన చివరి సమావేశం అని స్పష్టం చేశారు.ఇదే సమయంలో సాటి కార్యకర్తలకు అండగా నిలబడతానని పేర్కొన్నారు.

శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు.టికెట్టు రాకపోవడం తనకి ఎంతగానో బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ( Telugu Desam Party )స్థాపించినప్పటి నుంచి… పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని తాను ఏం పాపం చేశానని టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు.పార్టీలు మారిన నేతలకు టికెట్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.తాను పోటీ చేయకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.గత 26 రోజులుగా తనకు నిద్ర లేదని తెలిపారు.తనపై జగన్( jagan ) ప్రభుత్వం 11 కేసులు పెట్టిన భయపడలేదని ప్రభుత్వంపై పోరాటం చేశానని స్పష్టం చేశారు.తనకు పదవులు ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు.

రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలో బండారు సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేయటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube