Sequel Movies: ప్రస్తుతం వస్తున్న టాలీవుడ్ చిత్రాలన్నీ సీక్వెల్స్ మాత్రమే.. ఎందుకు ఇలా ?

గ్రౌండ్ ఫ్లోర్ పటిష్టంగా నిర్మించగలిగితే దానిపైన ఎన్ని అంతస్తులైన నిర్మించుకోవచ్చు.ఇది అందరికీ తెలిసిన విషయం.

 Tollywood Movies And Their Sequles-TeluguStop.com

ఇప్పుడు ఇదే స్ట్రాటజీ తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగా వాడుతుంది.అందుకే రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాకు సీక్వెల్ నిర్మించే పనిలో ఉంది టాలీవుడ్.

ఒకప్పుడు సీక్వెల్ పేరు చెప్తేనే టాలీవుడ్ భయపడేది.ఎందుకంటే శంకర్ దాదా ఎంబిబిఎస్, సర్దార్ గబ్బర్ సింగ్, గాయం, చంద్రముఖి, ఆర్య ( Shankar Dada MBBS, Sardar Gabbar Singh, Gayam, Chandramukhi, Arya )వంటి సినిమాలకు సీక్వెల్ చిత్రాలు దారుణంగా డిజాస్టర్ ఫలితాలను అందించడంతో సిక్వెల్ అనే విషయాన్ని కొన్ని రోజుల పాటు మేకర్స్ పక్కన పెట్టారు.

ఆ తర్వాత కార్తికేయ 2, బంగార్రాజు, F3( Karthikeya 2, Bangarraju, F3 ) వంటి సినిమాలు మళ్లీ సీక్వెల్స్ కి ఊపిరి పోసాయి.దాంతో ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.

పాత కథలకు కొనసాగింపులు మొదలయ్యాయి.

Telugu Arya, Bangarraju, Chandramukhi, Dj Tillu, Gayam, Karthikeya, Sardargabbar

పైగా ఇలా హిట్ సినిమాలకు సీక్వెల్ తీయడం వల్ల కొత్తగా ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు.మొదటి సినిమానే ఆ పని పూర్తి చేసి పెడుతుంది.ప్రస్తుతం థియేటర్స్ లో డీజే టిల్లు ( DJ Tillu ) సినిమాకి ఈ రేంజ్ పాపులారిటీ అలాగే ఓపెనింగ్స్ వచ్చాయి అంటే దానికి కారణం మొదటి సినిమానే.

అలాగే బాహుబలి కే జి ఎఫ్ చిత్రాల సీక్వెల్స్ కూడా అందుకు బాగా సహకరించాయి.ఈ దోవలోనే పుష్ప, దేవర, సలార్ సినిమాలకు కూడా సీక్వెల్స్ తీసే పనిలో ఉన్నారు మేకర్స్.

ఈ మూడు సినిమాలకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఒకే కథను రెండు పార్టులుగా తీస్తున్నారు.అయితే ఇలా కాకుండా క్యారెక్టర్ ని బేస్ చేసుకుని సీక్వెల్స్ తీయడం మరొక పద్ధతి.

Telugu Arya, Bangarraju, Chandramukhi, Dj Tillu, Gayam, Karthikeya, Sardargabbar

ఇలా క్యారెక్టర్ బేస్ చేసుకుని వస్తున్న సీక్వెల్స్ విషయానికి వస్తే డీజే టిల్లు కి స్క్వైర్ , ఎఫ్ 2 కి ఎఫ్ 3 అలాగే ప్రతినిధి సినిమాకి సీక్వెల్ తో పాటు గూఢచారి చిత్రానికి కూడా రెండవ భాగం రాబోతున్నాయి.అలాగే ఈ స్మార్ట్ శంకర్ క్యారెక్టర్లైజేషన్ తోనే డబల్ ఇస్మార్ట్ కూడా తెరకెక్కుతోంది.ఇదే కాకుండా ఇటీవల విడుదలైన హనుమాన్ సినిమాకి కూడా జై హనుమాన్ పేరుతో సిక్వెల్ నిర్మాణం జరుపుకోబోతోంది.శ్రీ విష్ణు సైతం తాను గతంలో తీసిన రాజరాజ చోళ చిత్రానికి స్వాగ్ అనే సీక్వెల్ తీయబోతున్నారు.

ఇలా ఏ వైపు చూసినా సీక్వెల్స్ హడావిడి ఎక్కువైపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube