వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన తో కలిసి ముందడుగులు వేస్తోంది.టిడిపి( TDP ) పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయింది.
ఈ మేరకు పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు.ఒకవైపు అధికార పార్టీ వైసీపీ సిద్దం పేరుతో భారీగా బహిరంగ సభలు నిర్వహిస్తూ, పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తూ, ప్రజల్లోనూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో రా కదిలిరా( Raa Kadali Ra Meeting ) పేరుతో టిడిపి భారీ బహిరంగ సభలే నిర్వహిస్తోంది.ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) జిల్లాలు, నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని( Srikakulam District ) 80 ఫీడ్స్ రోడ్డులో రా కదిలి రా బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.టిడిపి, జనసేన అభ్యర్థులను ఖరారు చేస్తూనే పార్టీ కార్యక్రమాలను మరింత చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు.
ఈరోజు శ్రీకాకుళంలో నిర్వహించనున్న రా కదిలిరా బహిరంగ సభకు టిడిపి శ్రేణులు భారీగా హాజరయ్యే విధంగా జన సమీకరణ పై దృష్టి సారించారు.సిద్దం( Siddham ) పేరుతో జగన్( Jagan ) భారీగా బహిరంగ సభలు నిర్వహిస్తూ, జనసేన కు జనం వస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉండడంతో, అంతే స్థాయిలో తాము జన సమీకరణ చేపట్టి తమ బలం నిరూపించుకోవాలని టిడిపి భావిస్తుంది.దీనిలో భాగంగానే ఈ సభకు భారీగా జనాలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేపట్టారు.ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ సభ మొదలై 5.30 కి ఈ సభ ముగుస్తుంది.
అయితే ఈ సభలో చంద్రబాబు ఏఏ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడుతారు అనేది ఆసక్తికరంగా మారింది .ఒకవైపు టిడిపి , జనసేన టికెట్లు ప్రకటిస్తుండడం , రెండు పార్టీలు నేతల్లోనూ దీనిపై అసంతృప్తి నెలకొనడం వంటి అంశాలపై బాబు పరోక్షంగా వ్యాఖ్యానించడంతో పాటు ,అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని తన ప్రసంగం వినిపించే అవకాశం కనిపిస్తోంది.పార్టీకి పట్టున్న ఉత్తరాంధ్రలో సెంటిమెంటును మరింత రాజేసే విధంగా, రాజకీయంగా టిడిపికి కలిసి వచ్చే విధంగా చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉంది.