కుటుంబాలను కకావికలం చేసే వాటిల్లో మొదటి స్థానంలో ఉండేది అనుమానం.ఇది కంటికి కనిపించదు గానీ దీని ధాటికి ఎవ్వరైనా బలైపోతుంటారు.
భార్యా భర్తల నడుమ వచ్చే చిన్న చిన్న అనుమానాలు పెను భూతంలా మారి చివరకు కుటుంబాన్నే బలితీసుకునే స్థాయి దాకా వెళ్తున్నాయి.కొన్ని సార్లు అయితే చిన్నారులను కూడా బలి తీసుకుంటున్నాయి.
ఇలాంటి అమానుషల ఘటనలు నిజంగా చాలా ప్రమాదకరమనే చెప్పాలి.ఎందుకంటే అనుమానం ఓ పాత రోగం లాంటిది.
ఇది ముదిరితే గనక చివరకు ఎవరో ఒకరిని బలి తీసుకుంటుంది.
అప్పటి వరకు సంతోషాలతో ఉన్న వారు కూడా చివరకు రాక్షసుల్లా మారిపోతారు.
కుటుంబంలో చెలరేగే చిన్న చిన్న మనస్పర్థలే పెద్ద అనుమానపు బూతంలా మారి పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది.ఇప్పుడు కడూ ఇలాంటి ఓ దారుణ మైన గటన గురించి తెలుసుకోబోతున్నాం.
దీన్ని చూసిన తర్వాత నిజంగా అనుమానం ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది.రాయ్ పూర్ లో నివసించే భాస్కర్ సుప్రీతకు ఇద్దరు పిల్లలు.
కాగా ఓ రోజు భాస్కర్ తన ఫ్రెండ్ తో కలిసి కారులో పనిమీద వెళ్లాడు.అయితే ఆ ఫ్రెండ్ చివరకు అదే కారులో శవమై చనిపోయాడు.
దీంతో భాస్కర్ మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.పలుమార్లు విచారించే సరికి అతని భార్య సుప్రీత కూడా అతనే హత్య చేశాడని అనుమానించింది.ఎందుకంటే భర్త కుటుంబం కూడా హత్యా నేపథ్యం ఉన్న వారే అని సుప్రీతకు ఎప్పటి నుంచో అనుమానిస్తోంది.ఇదే విషయమై అతన్ని నిత్యం వేధించేది.దీంతో ఆమె వేధింపులు తట్టుకోలేక భాస్కర్ ఆమెను దారుణంగా చంపేశాడు.అయితే పిల్లలు అనాథలైపోతారనే భయంతో వారిని కూడా కిరాతకంగా చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా అనుమానం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది.
.