జీ తెలుగుతో మహేష్ బాబు డీల్.. అచ్చం నాగార్జునలానే బుల్లితెరపై కనిపించనున్న బాబు!

ప్రస్తుతం వెండితెర కంటే ఎక్కువగా బుల్లితెర దూసుకుపోతుంది.పైగా బుల్లితెరకు విపరీతమైన అభిమానుల సంఖ్య కూడా పెరిగింది.

 Super Star Mahesh Babu Huge Deal With Zee Telugu Details, Mahesh Babu, Zee Telug-TeluguStop.com

కేవలం సీరియల్స్ కాకుండా ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారం అవుతూ బాగా సందడి చేస్తున్నాయి.ఇక బుల్లితెరపై కొత్తగా ప్రసారమయ్యే సీరియల్స్, షోలను ప్రమోట్ చేయడానికి వెండితెర సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే నాగార్జున బుల్లితెరపై పలు సీరియల్స్ తో పాటు పలు షో లను కూడా ప్రమోట్ చేసిన సంగతి తెలిసింది.ఇక తాజాగా మహేష్ బాబు కూడా బుల్లితెర ఛానల్ జీ తెలుగులో డీల్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఇంతకు ఆ డీల్ ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే.

తన లుక్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుని అభిమాన హీరో గా నిలిచాడు.ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు.తొలిసారిగా ఇండస్ట్రీకి బాల నటుడుగా పరిచయమైన మహేష్ బాబు చిన్న వయసులోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Mahesh Babu, Nagarjuna, Serials, Shows, Sitara, Maa, Zee Telugu-Movie

దాదాపు చిన్నవయసులోనే ఎనిమిది సినిమాలకు పైగా నటించాడు.ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.ఈ సినిమాలో తన నటనతో ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు.అలా యువరాజు, వంశీ, మురారి, పోకిరి, అర్జున్ వంటి ఎన్నో సినిమాలు మహేష్ బాబు కు మంచి గుర్తింపును అందించాయి.

ఎక్కువగా క్లాస్ సినిమాలకే మంచి ప్రాధాన్యం ఇస్తాడు మహేష్ బాబు.

ఇక కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ గా కూడా బాధ్యతలు వహించాడు.

మహేష్ బాబు నటుడుగానే కాకుండా వ్యక్తిగతం పట్ల కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.రెండు గ్రామాలను దత్తత తీసుకోవటమే కాకుండా వారికి తన వంతు సహాయం అందిస్తున్నాడు.

అంతేకాకుండా సమాజసేవలు కూడా చేస్తుంటాడు.ఈయనకు సొంతంగా నిర్మాణ సంస్థ కూడా ఉంది.

Telugu Mahesh Babu, Nagarjuna, Serials, Shows, Sitara, Maa, Zee Telugu-Movie

ఇక మహేష్ బాబు తనతో కలిసి నటించిన నటి నమ్రతా శిరోద్కర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.నమ్రత మాజీ మిస్ ఇండియా గా కూడా నిలిచింది.ఈమె ఎక్కువగా హిందీ సినిమాలలో నటించింది.వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.మహేష్ బాబు సినిమా విషయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.

ఇదంతా పక్కన పెడితే.మహేష్ బాబు జీ తెలుగు తో ఒక డీల్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.అదేంటంటే అందులో ప్రసారం అయ్యే షో లను, సీరియల్స్ ను ప్రమోట్ చేయటానికి డీల్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.తాజాగా తన కూతురు సితార తో కలిసి ఓ డాన్స్ షోను ప్రమోట్ చేయడానికి వచ్చాడు.

ఇక దానికి మహేష్ బాబు 9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube