సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే ఇండస్ట్రీలో చాలా ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి.అందుకోసమే సక్సెస్ ఫుల్ హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ క్రేజ్ అనేది ఉంటుంది.
దర్శక నిర్మాతలు వాళ్ళని సినిమాల్లో తీసుకొని వాళ్ల ద్వారా సినిమా మీద బజ్ క్రియేట్ చేసి ఫైనల్ గా సినిమాను సక్సెస్ చేసే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం శర్వానంద్( Sharwanand ) హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను( Samyuktha Menon ) తీసుకున్నారు.
నిజానికి సంయుక్త మీనవ్ చేసిన బీమ్లా నాయక్, బింబిసారా, విరూపాక్ష సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక దాంతో ఆమెకు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అయితే పెరిగింది.ఇక ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ ఆమె భారీగా రెమ్యూనరేషన్ ను తీసుకుంటూ మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటిస్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా చాలా చక్కటి అవకాశాలను కూడా సంపాదించుకుంటుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె వరుసగా మీడియం రేంజ్ హీరోలందరిని లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో( Bellamkonda Sai Srinivas ) కూడా ఒక సినిమాలో నటిస్తూ చాలా బిజీగా ఉంది.మరొక పెద్ద హీరో సినిమాలో కూడా సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుందనే ప్రస్తుతం అని చెప్పాలి.ఈమె చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ లు సాధించడం కూడా ఆమెకు గోల్డెన్ లెగ్ గా మారి అటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇటు దర్శక నిర్మాతలు కూడా ఆమె మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు…
.