బాలీవుడ్( Bollywood ) లో స్టార్ హీరోల తనయులే కాదు తనయురాళ్లు కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాల్లో రాణిస్తుంటారు.అక్కడ స్టార్ హీరోల కూతుళ్లు తెరంగేట్రం చేసి సక్సెస్ ఫుల్ కెరీర్ కొన్సాగిస్తున్నారు.
వారిలో సైఫ్ అలి ఖాన్ కూతురు సారా అలి ఖాన్( Sara Ali Khan ) కూడా ఒకరు.సైఫ్ కూతురుగా కాకుండా తన టాలెంట్ తో బీ టౌన్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది సారా.
అయితే ఈమధ్య సౌత్ సినిమాలు చేస్తున్న హంగామా చూసి తను కూడా సౌత్ సినిమాల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ చూపిస్తుందట.తన పీ.ఆర్ టీం తో సౌత్ సినిమాలకు కూడా తను ఓకే అన్న మెసేజ్ ని ఇక్కడ దర్శక నిర్మాతలకు పంపిస్తుందట.
ఆల్రెడీ సైఫ్ తెలుగులో దేవర( Devara ) సినిమా చేస్తున్నాడు.ఫాదర్ ఎలాగు ఇక్కడ అడుగు పెట్టాడు కాబట్టి త్వరలోనే కూతురు కూడా వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందని తెలుస్తుంది.సారా అలి ఖాన్ తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉందని తెలుస్తుంది.
అమ్మడు ఓకే అనాలే కానీ ఆమెతో మంచి సినిమాలు చేసేందుకు మన మేకర్స్ రెడీగా ఉన్నారు.మరి సారా తెలుగు సినిమా ఏది అవుతుంది ఏ స్టార్ హీరో సరసన ఆమె ఓకే చెబుతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.