విజయ డయాగ్నొస్టిక్‌ ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?

ప్రముఖ డయాగ్నొస్టింగ్‌ సెంటర్‌ అయిన విజయ డయాగ్నొస్టిక్‌ తమ షేర్లను ట్రేడ్‌ చేయనుంది.ఒక్కో షేరును రూ.522–531 గా నిర్ణయించింది.దీని ద్వారా అదనంగా రూ.1895 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది.విజయా డయాగ్నొస్టిక్‌ ఐపీఓ (ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రాబోయే సెప్టెంబర్‌ 1న మొదలుకానుంది.

 Should You Invest In Vijaya Diagnostic Ipo , Daignostic Cenre , Equity Market ,-TeluguStop.com

సెప్టెంబర్‌ 3తో ముగియనుంది.ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌).ఇందులో ఉన్న ప్రమోటర్లు, పెట్టుబడిదారులు తమ వాటాను తగ్గించుకుంటారు.మీరు ఇందులో పెట్టుబడి పెట్టాలనుకుంటే, వీటి వివరాలు తెలుసుకోవాలి.

ముందుగా విజయ కొత్త స్టాక్‌ మార్కెట్‌ షేర్లను విక్రయించడం లేదని గుర్తుంచుకోవాలి.ఇది పూర్తిగా ఓఎఫ్‌ఎస్‌.

దీంతో 3,56,88,064 షేర్లను విక్రయించనుంది.ప్రమోటర్‌ ఎస్‌ సురేంద్రనాథ్‌ రెడ్డి, కరకోరం లిమిటెడ్, కేదర క్యాపిటల్‌ అల్ట్రనేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్లు తమ 35 శాతం వాటాను విక్రయించనున్నాయి.డాక్టర్‌ సురేంద్రనాద్‌ రెడ్డి 50.95 లక్షల షేర్లను, కరకోరాం లిమిటెడ్‌ 2.94 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నాయి.కేదర క్యాపిటల్‌ 11.02 లక్షల షేర్లను విక్రయించనుంది.ఐపీఓలో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూష్‌నల్‌ కొనుగోలుదారులకు (క్యూఐబీ) రిజర్వ్‌ చేయనుంది.35 శాతం రిటైల్‌ పెట్టుబడిదారులకు, మిగతా 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూష్‌నల్‌ కొనుగోలుదారులకు.

Telugu Qualififed, Kolkatta, Stock, Telengana-General-Telugu

ఉద్యోగులకు 1.5 లక్షలమొత్తం షేర్లను ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడెల్‌లైజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, కొటాక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీకి ∙ఐపీఓ కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లుగా నియమించారు.విజయా డయాగ్నొస్టిక్‌ పాథాలజీ, రేడియోలజీ పరీక్షల సేవలను విస్త్రతంగా అందిస్తోంది.

ఏపీ, తెలంగాణ, కోల్‌కతా, ఎన్‌సీఆర్‌లలో 80 డయాగ్నొస్టిక్‌ సెంటర్లతోపాటు 11 రెఫరెన్స్‌ లాబొరేటరీస్‌ ఉన్నాయి.గత ఆర్థిక సంవత్సరంలో రూ.84.91 కోట్లు ఎక్కువ లాభాన్ని ఆర్జించింది.కంపెనీ ఆదాయం రూ.389 కోట్లు.ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత ఖర్చుల్లో రోగనిర్ధారణ సేవల కోసం వాటా 8–14 శాతం కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube