Nagarjuna Gitanjali Movie : నాగ్ సినిమా చూసి ఇదేం సినిమా బాబోయ్ అన్న బయ్యర్లు.. చివరకు?

కొన్ని సినిమాలు మొదట చూసిన సమయంలో నచ్చకపోయినా తర్వాత రోజుల్లో ప్రేక్షకులకు నచ్చుతాయి.ఈ విధంగా ప్రేక్షకులకు మొదట నచ్చకుండా తర్వాత నచ్చిన సినిమాల జాబితా ఎక్కువ సంఖ్యలోనే ఉంది.

 Shocking Facts About Nagarjuna Hit Movie Details Here Goes Viral , Buyyers , Na-TeluguStop.com

నాగార్జున నటించిన సినిమాలలో గీతాంజలి సినిమా ఒకటి కాగా ఈ సినిమా రిలీజ్ సమయంలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి.ఈతరం ప్రేక్షకులకు గీతాంజలి క్లాసిక్ మూవీ అనే సంగతి తెలిసిందే.

డైరెక్టర్ మణిరత్నం తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమాలలో గీతాంజలి సినిమా మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే.కొత్త నటి గిరిజ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించింది.

ఊటీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా ఇళయరాజా ఈ సినిమాకు అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది.హీరోహీరోయిన్ కు క్యాన్సర్ అని తెలిసి మొదట ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఆసక్తి చూపించలేదు.

సినిమా ఫ్లాప్ అవుతుందని భావించి బయ్యర్లు ఈ సినిమా హక్కులను కొనలేదు.అయితే నిర్మాత నరసారెడ్డి మాత్రం ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందని నమ్మి ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు.

మొదట మూడు వారాలు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు.అయితే ఆ తర్వాత వారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు పుంజుకున్నాయి.

Telugu Actress Girija, Buyyers, Mani Ratnam, Gitanjali, Nagarjuna, Reddy-Movie

సినిమా బాగుందని పాటలు బాగున్నాయని టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరిగాయి.ఈ సినిమా రిలీజైన సమయంలో గీతాంజలి డ్రెస్ లు పాపులర్ అయ్యాయి.ఈ సినిమా తర్వాత ఈ సినిమా హీరోయిన్ గిరిజ ఎక్కువ సినిమాల్లో నటించలేదు.ఇదేం సినిమా బాబోయ్ అన్న బయ్యర్లు ఈ సినిమా కలెక్షన్లను చూసి షాకవ్వడం గమనార్హం.

నాగ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు ఇప్పట్లో రావని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube