సుగంధ ద్రవ్యాల రారాజు కుంకుమ పువ్వు అని ఆయుర్వేద వైద్యులందరికీ బాగా తెలుసు.ఆయుర్వేద వైద్యంలో సుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యత ఎంతో ఉంది.
జీర్ణ క్రియలో సహాయ పడడం మరియు గర్భిణీ స్త్రీ లలో ఆకలి మెరుగుపరచడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.కుంకుమపువ్వు లో ఉన్న ఎన్నో రకాల ఔషధాల వల్ల దీనికి ఎక్కువగా దీన్ని ఎక్కువగా గర్భిణీ స్త్రీలు ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే ఆడవారు గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తీసుకోవడం గురించి అనేక అపోహలు ఉన్నాయి.గర్భధారణ లో ఆడ వారు కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు మూడు నుంచి నాలుగు రకాల కుంకుమ పువ్వు ను పాలలో కలుపుకొని తాగడం వల్ల గర్భిణీ స్త్రీల లో అధిక రక్తపోటు తగ్గి రిలాక్స్ గా ఉంటారు.
గర్భిణీ స్త్రీ లలో మలబద్ధకం గ్యాస్ మరియు కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యలు ఉంటాయి.కుంకుమపువ్వు రక్తప్రసరణను పెంచి జీర్ణ క్రియ రేటును పెంచుతుంది.కుంకుమ పువ్వు టీ గర్భధారణ సమయంలో వికారం తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
గర్భధారణ సమయంలో చాలా మంది ఆడ వారు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు.అలాంటి వారు ప్రతి రోజు కుంకుమ పువ్వు తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
గర్భవతులకు రక్తం పెరిగే అవకాశం ఉంది.కుంకుమ పువ్వులో అధిక యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం మరియు క్రోసెటిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించి బిడ్డ గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
రాత్రి సమయంలో వేడి పాల లో కుంకుమ పువ్వు ను కలిపి తాగితే ప్రశాంతమైన నిద్ర వస్తుంది.అంతే కాకుండా కుంకుమ పువ్వు లో ఉండే పాలలో దగ్గు, ఉబ్బసాన్ని తగ్గించే శక్తి ఉంది.
కుంకుమపువ్వు తగినంత మోతాదులో తీసుకోవడమే ఉత్తమమైన పని.