నాగ్ సినిమా చూసి ఇదేం సినిమా బాబోయ్ అన్న బయ్యర్లు.. చివరకు?
TeluguStop.com
కొన్ని సినిమాలు మొదట చూసిన సమయంలో నచ్చకపోయినా తర్వాత రోజుల్లో ప్రేక్షకులకు నచ్చుతాయి.
ఈ విధంగా ప్రేక్షకులకు మొదట నచ్చకుండా తర్వాత నచ్చిన సినిమాల జాబితా ఎక్కువ సంఖ్యలోనే ఉంది.
నాగార్జున నటించిన సినిమాలలో గీతాంజలి సినిమా ఒకటి కాగా ఈ సినిమా రిలీజ్ సమయంలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈతరం ప్రేక్షకులకు గీతాంజలి క్లాసిక్ మూవీ అనే సంగతి తెలిసిందే.డైరెక్టర్ మణిరత్నం తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమాలలో గీతాంజలి సినిమా మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే.
కొత్త నటి గిరిజ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించింది.ఊటీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా ఇళయరాజా ఈ సినిమాకు అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది.
హీరోహీరోయిన్ కు క్యాన్సర్ అని తెలిసి మొదట ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఆసక్తి చూపించలేదు.
సినిమా ఫ్లాప్ అవుతుందని భావించి బయ్యర్లు ఈ సినిమా హక్కులను కొనలేదు.అయితే నిర్మాత నరసారెడ్డి మాత్రం ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందని నమ్మి ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు.
మొదట మూడు వారాలు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు.
అయితే ఆ తర్వాత వారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు పుంజుకున్నాయి. """/"/
సినిమా బాగుందని పాటలు బాగున్నాయని టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరిగాయి.
ఈ సినిమా రిలీజైన సమయంలో గీతాంజలి డ్రెస్ లు పాపులర్ అయ్యాయి.ఈ సినిమా తర్వాత ఈ సినిమా హీరోయిన్ గిరిజ ఎక్కువ సినిమాల్లో నటించలేదు.
ఇదేం సినిమా బాబోయ్ అన్న బయ్యర్లు ఈ సినిమా కలెక్షన్లను చూసి షాకవ్వడం గమనార్హం.
నాగ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు ఇప్పట్లో రావని తెలుస్తోంది.
మధుమేహం ఉన్నవారు మెంతికూర తింటే ఏం అవుతుందో తెలుసా?