టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు వరుసగా సినిమాలలో నటిస్తున్నారు.అయితే బాహుబలి2 మూవీ విడుదలై ఆరేళ్లు అయినా ఈ ఆరేళ్లలో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు మాత్రమే థియేటర్లలో విడుదలయ్యాయి.
ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.సినిమాల రిలీజ్ విషయంలో ప్రభాస్ ప్లానింగ్ తప్పుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ప్రభాస్ విషయంలో జరిగిన తప్పు తన విషయంలో జరగకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr NTR ) జాగ్రత్త పడుతున్నారు.దేవర 2( Devara 2 ) సినిమాను ప్రకటించినా దేవర్2 సెట్స్ పైకి వెళ్లే సమయానికి మరో రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా తారక్ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది.2024లో దేవరను రిలీజ్ చేస్తున్న తారక్ 2025లో మాత్రం వార్2, ( War 2 ) ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండటం గమనార్హం.

ఈ సినిమాలు ఏ రేంజ్ లో కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు లాభాలను అందిస్తాయో చూడాలి.ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఇకపై ఏ మాత్రం గ్యాప్ రాకుండా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.పొలిటికల్ అంశాలకు దూరంగా ఉంటూనే పొలిటికల్ వివాదాల్లో చిక్కుకోకుండా కెరీర్ విషయంలో తారక్ ముందడుగులు వేస్తున్నారు.

తారక్ తన నటనా సామర్థ్యానికి తగిన కథలను ఎంచుకుంటున్నారని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తారక్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దేవర సినిమాలో( Devara Movie ) యాక్షన్ సీక్వెన్స్ లు సైతం న భూతో న భవిష్యత్ అనేలా ఉండనున్నాయని తెలుస్తోంది.దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా ఆమె పాత్రకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.