వడ్డే నవీన్ అంటే ఇప్పటి యువతకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ రెండు దశాబ్దాల క్రితం వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో వడ్డే నవీన్ ఒకరు.చేసింది తక్కువ సినిమాలే అయినా తక్కువ కాలంలోనే వడ్డే నవీన్ స్టార్ డం ను సొంతం చేసుకున్నారు.
మొదట్లో హీరోగా విజయాలు అందుకున్న నవీన్ కు ఒక దశలో వరుస ఫ్లాపులు పలకరించాయి.
దీంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు.
కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన వడ్డే నవీన్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు.కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్ హీరోగా మహేశ్వరి హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి చిత్రం వడ్డే నవీన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
చాలా బాగుంది, ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు, మా బాలాజీ సినిమాలు నవీన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
అయితే వడ్డే నవీన్ వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలియదు.
సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయినే వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు.స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమారుడు రామకృష్ణ కూతురు అయిన చాముండేశ్వరిని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల వడ్డే నవీన్, చాముండేశ్వరి విడిపోయారు.అయితే వ్యక్తిగత సమస్యల వల్లే నవీన్ కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డాడని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
ఆ తర్వాత వడ్డే నవీన్ మరో అమ్మాయిని వివాహం చేసుకుని ప్రస్తుతం సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ చివరిగా నాలుగేళ్ల క్రితం మనోజ్ హీరోగా నటించిన ఎటాక్ సినిమాలో నటించారు.