స్టార్ హీరో బాలయ్య( Balakrishna ) అభిమానులలో చాలామందికి బాలయ్య సినిమాలలో చెన్నకేశవరెడ్డి సినిమా( Chennakeshava Reddy ) అంటే ఇష్టం.ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించగా చిన్నచిన్న లోపాలు ఉన్నా ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం హిట్ గా నిలిచింది.
నిర్మాతలకు సైతం ఈ మూవీ మంచి లాభాలను అందించింది.ఈ సినిమా డైరెక్టర్ వి.వి.వినాయక్( VV Vinayak ) సైతం పలు సందర్భాల్లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో న్యాయం చేయలేకపోయానని చెబుతారు.
అయితే ఈ సినిమా మరీ భారీ హిట్ కాకపోవడానికి కథనంలోని కొన్ని చిన్నచిన్న తప్పులు కారణమని చెప్పవచ్చు.ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ వేగంగా జరగడం వల్ల క్వాలిటీ విషయంలో కొంతమేర రాజీ పడటంతో ఆ ప్రభావం సినిమా ఫలితంపై పడింది.
ఈ సినిమా విడుదల సమయానికి కూడా ఒక సాంగ్, కొన్ని సీన్ల షూట్ బ్యాలెన్స్ ఉండటంతో సినిమా విడుదలైన తర్వాత ఒక సాంగ్ ను యాడ్ చేయడం జరిగింది.
చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్( Balayya Dual Role ) చేయగా ఒక పాత్రను పవర్ ఫుల్ గా చూపించి మరో పాత్రను వీక్ గా చూపించడం ఈ సినిమాకు మైనస్ అయింది.నిర్మాత ఒత్తిడి చేయడం వల్లే ఈ సినిమాపై ఎఫెక్ట్ పడింది.సినిమా విడుదలైన తర్వాత చిత్రయూనిట్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదనే విధంగా కామెంట్లు చేయడం కూడా సినిమా రిజల్ట్ పై, కలెక్షన్లపై ప్రభావం చూపింది.
ఈ సినిమా రిజల్ట్ విషయంలో వినాయక్ బాధ పడుతుండగా బాలయ్య నీ వంతు నువ్వు కష్టపడ్డావని ఫలితం గురించి బాధ పడాల్సిన అవసరం లేదని ఓదార్చారు.చెన్నకేశవరెడ్డి సినిమా విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.