ఆప్ పార్టీ నేత, ప్రస్తుత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్( Delhi CM Kejriwal ) అవినీతి, అక్రమ మద్యం పాలసీ కేసులో నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే.కేజ్రీవాల్‌ను రీసెంట్ గా అరెస్టు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో చాలా మంది అన్నా హజారే( Anna Hazare ) గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.అన్నా హజారే కేజ్రీవాల్‌కు గురువు అనే విషయం విదితమే.
ప్రస్తుతం ఆయనకు 86 ఏళ్లు.హజారే మొదటినుంచి అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు.
నిజానికి కేజ్రీవాల్ కూడా అవినీతి అక్రమాలకు అదే వ్యతిరేకతను కనబరిచారు.
మద్యపాన వినియోగాన్ని కూడా కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించేవారు.
అన్నా హజారేతో కలిసి మరీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు కేజ్రీవాల్.ఇప్పుడు అదే మద్యం పాలసీ కేసులో ఇరుక్కుపోయి కటకటాల పాలయ్యారు.
కేసీఆర్ కూతురు కవిత( Kavitha ) కూడా ఈసారి తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు కానీ అదే మద్యపానం కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు.

ఈ అరెస్టుల నడుమ అన్నా హజారే చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.కేజ్రీవాల్ ని ఉద్దేశించి కర్మ ఫలితం అనుభవించక తప్పదు అని ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.“ఆల్కహాల్‌కు వ్యతిరేకంగా నాతో పాటే కలిసి పోరాడిన కేజ్రీవాల్ ఇప్పుడు ఆల్కహాల్ పాలసీ( Alcohol Policy ) కేసులోనే అరెస్ట్ కావడం చాలా విచారకరం.అతను గతంలో ఏం పని చేశాడో దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నాడు.చట్టం ఎప్పటికైనా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.కేజ్రీవాల్ మద్యం పాలసీ రూపొందించాడని తెలిసి నేను బాగా బాధపడ్డా.

అదే బాధను వ్యక్తం చేస్తూ 2022లో అతడికి మొదటి లేఖ రాశాను.మద్యం మాత్రమే కాదు అధికారం కూడా మత్తెక్కిస్తుంది, ఆ అధికార మత్తులోనే నువ్వు ఉన్నావు, అని కేజ్రీవాల్‌కు గుర్తు చేశా.” అని అన్నా హజారే రెస్పాండ్ అయ్యారు.ఇకపోతే హోల్ సేల్ డీలర్లకు, రిటైలర్లకు లాభాలు వచ్చేలాగా ఢిల్లీ ప్రభుత్వం ఒక మద్యం పాలసీ రూపొందించింది.ప్రైవేట్ గా మద్యం అమ్మాలి అన్నట్లు, వచ్చిన లాభాలలో కొంత శాతం తమకు ఇవ్వాలన్నట్లు ఆప్ ఈ పాలసీ రూపొందించడం జరిగింది.
డబ్బు అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు, ఒప్పందాలు కూడా కుదిరాయని ఈడీ, సీబీఐ ఆరోపిస్తోంది.