తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శేఖర్ మాస్టర్(Sekhar Mastet) ఒకరు.ఢీ(Dhee) కార్యక్రమంలో పాటిస్పేట్ చేసిన ఈయన ఈ కార్యక్రమంలో గెలిచి అనంతరం స్వయంకృషితో ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్నారు.
ఇలా ఈయన కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా ఢీ డాన్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఢీ 15 క్వాటర్ ఫైనల్స్ కి చేరుకుంది.
ఇక ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ తో పాటు ప్రతి సీజన్లోనూ మరొక హీరోయిన్ జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు.
ఇప్పటికే ప్రియమణి, సదా, పూర్ణ వంటి హీరోయిన్స్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు.ఇక తాజాగా శ్రద్ధదాస్ (Sraddhadas) ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమంలో విడుదలైన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇందులో భాగంగా స్టేజ్ పైనే శేఖర్ మాస్టర్ శ్రద్ధాదాస్ తో కలిసి భారీ స్థాయిలో రొమాన్స్ చేస్తూ డాన్స్ చేశారు.ఈ ప్రోమోకి ఇదే హైలెట్ గా మారింది.
ఇక శ్రద్ధ దాస్ తో కలిసి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన కళావతి పాటకు(Kalavathi Song) డాన్స్ చేయడమే కాకుండా తనని హగ్ చేసుకోవడం తనని ఎత్తుకొని తిప్పుతూ రొమాన్స్ చేశారని చెప్పాలి.
ఈ విధంగా ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్ శ్రద్ధాదాస్ పర్ఫామెన్స్ చూసినటువంటి పలువురు నెటిజన్స్ వీరిపై భారీ స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.శేఖర్ మాస్టర్ రొమాంటిక్ పర్సన్ అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు హీరోయిన్ తో ఇలా రొమాన్స్ చేయడం ఏంటి మాస్టర్ అంటూ భారీగా ఈ ప్రోమో పై కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చిన ఢీషో.
ఇంకాస్త స్పైసీగా తయారవుతోంది.ఇక శ్రద్ధ దాస్ విషయానికి వస్తే నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో బుల్లితెరపై సందడి చేస్తున్నారు.