హిట్ ఇచ్చిన బ్యానర్ ని నమ్ముకున్న శర్వానంద్..!

టాలీవుడ్ లో బ్యాడ్ లక్ బాగా వెంటాడుతున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది యువ హీరో శర్వానంద్ అని చెప్పొచ్చు.స్టార్ హీరోకి ఉండే క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే కెరియర్ లో వెనకపడి పోయాడు శర్వానంద్.

 Sharwanand Uv Creations Movie Is On Cards Sharwanand, Uv Creations, Aadavallu Me-TeluguStop.com

లెక్క చెప్పుకోవడానికి సినిమాలు చేస్తున్నా ఏ ఒక్కటి సక్సెస్ అవట్లేదు.రణరంగం నుండి రీసెంట్ గా వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు వరకు వరుసగా 5 ఫ్లాపులు పడ్డాయి.

ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్నాడు శర్వానంద్.ఈ సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట.

యువి క్రియేషన్స్ బ్యానర్ అంటే శర్వానంద్ కి లక్కీ బ్యానర్ అని చెప్పొచ్చు.ఆ బ్యానర్ లో చేసిన రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా రెండు సినిమాలు సూపర్ హిట్ కొట్టాడు.

అందుకే తన ఫ్లాప్ ట్రాక్ నుండి హిట్ ట్రాక్ లోకి ఎక్కేలా శర్వానంద్ యువి బ్యానర్ లో సినిమాకు ఫిక్స్ అయ్యాడు.శర్వా ఓకే చెప్పడంతో కథల వేటలో పడ్డారు యువి నిర్మాతలు.

మంచి కథ దొరికితే వెంటనే యువితో శర్వానంద్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube