ఆచార్య అకౌంట్లు సెటిల్ చేస్తున్న కొరటాల..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి నటించిన ఆచార్య అంచనాలను తారుమారు చేసింది.సినిమా బాక్సాఫీస్ దగ్గర మెగా మేనియా చూపిస్తుందని అనుకుంటే మెగాస్టార్ ఖాతాలో మరో డిజాస్టర్ సినిమాగా మిగిలింది.

 Koratala Siva Settle Accounts To Acharya Distributors Koratala Siva , Acharya, D-TeluguStop.com

ఇక సినిమాలో చిరంజీవి, రాం చరణ్ ఉన్నాడు రికార్డులు కొట్టడం పక్కా అని బిజినెస్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు బాబోయ్ అనేస్తున్నారు.ఆచార్య సినిమా 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఈ సినిమా వసూళ్లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.ఆల్రెడీ ఫ్లాప్ టాక్ రాగా వసూళ్లు అంతకంతకూ దారుణంగా ఉన్నాయి.అయితే ఆచార్య లాసులకు కూడా డిస్ట్రిబ్యూటర్లకు డైరక్టర్ కొరటాల శివ హామీ ఇస్తున్నట్టు తెలుస్తుంది.సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే బాధ్యత వహించాల్సింది డైరక్టరే కాబట్టి.

ఆచార్య ఫ్లాప్ బాధ్యత మీద వేసుకున్న కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్ల ఎకౌంట్లని కూడా సెటిల్ చేస్తున్నట్టు తెలుతుంది.ఆచార్య సినిమా కోసం కొరటాల శివ రెమ్యునరేషన్ లేకుండా పనిచేశాడని తెలిసిందే.

మరి ఈ లాసుల్లో కొరటాల శివ కూడా భాగం పంచుకునేలా ఉన్నాడు. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు అందుకున్న కొరటాల శివ కెరియర్ లో ఫస్ట్ టైం ఫ్లాప్ సినిమా టేస్ట్ తెలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube