ప్రస్తుతం ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని షారుఖ్ ఖాన్ పేరు చెప్పేయొచ్చు.యంగ్ స్టార్ హీరోలు సౌత్ నుండి ఒక రేంజ్ పోటీ ఇస్తున్న ఈ రోజుల్లో, తనకి మించిన సూపర్ స్టార్ ఎవరూ లేరు అని షారుఖ్ ఖాన్ రీసెంట్ గా విడుదలైన ‘పఠాన్’ మరియు ‘జవాన్‘ సినిమాలతో నిరూపించుకున్నాడు.
ఈ రెండు చిత్రాలు కూడా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన సినిమాలే.ఒకే ఏడాది లో రెండు సార్లు వెయ్యి కోట్లు కొల్లగొట్టడం అనేది సాధారణమైన విషయం కాదు.
ఆ రెండు సినిమాలు కూడా కంటెంట్ పరంగా పెద్దగా గొప్పవేమి కాదు, అయినా కూడా ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయి అంటే, షారుఖ్ ఖాన్ కి ‘3 ఇడియట్స్’, ‘దంగల్’ రేంజ్ బ్లాక్ బస్టర్స్ పడితే ఇక ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ప్రస్తుతం ఆయన రాజ్ కుమార్ హిరానీ తో ‘దుంకీ’ అనే చిత్రం చేస్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ ఇప్పటి వరకు మున్నా భాయ్ MBBS , లగేరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసాడు.ప్రతీ చిత్రం ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యాయి.
మన టాలీవుడ్ కి రాజమౌళి( Rajamouli ) ఎలాగో, బాలీవుడ్ కి రాజ్ కుమార్ హిరానీ( Rajkumar Hirani ) అలా అన్నమాట.అలాంటి డైరెక్టర్ తో ఒక రేంజ్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ సినిమా చేస్తే ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.
ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున విడుదల కాబోతుంది.అదే రోజు ప్రభాస్ ‘సలార్‘ చిత్రం కూడా విడుదల కాబోతుంది.ఈ సినిమా మీద కూడా అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.

బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) తెరకెక్కిస్తున్న సినిమా ఇది, అందుకే ఆ స్థాయి అంచనాలు ఉన్నాయి.ఈ రెండు సినిమాలు ఒక రోజు పోటీ పడితే కచ్చితంగా రెండు చిత్రాలకు నష్టం కలుగుతాయి.అందుకే ‘సలార్’ మూవీ నిర్మాతలు షారుఖ్ ఖాన్ కి ఫోన్ చేసి మీ చిత్రాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోగలరా అని అడిగారట.
అందుకు షారుఖ్ ఖాన్ ‘సలార్‘ కోసం నేను వెనక్కి వెళ్లాలా?, ఇంతకీ ఆ చిత్రం లో హీరో ఎవరు అన్నాడట.మేము డిసెంబర్ 22 వ తారీఖున వచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాము, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు ,మేము విడుదల తేదీ ఇచ్చి చాలా రోజులు అయ్యింది, మేమెందుకు వెనక్కి వెళ్తాము?, అవసరం అయితే మీరే వెళ్ళండి అని సమాధానం ఇచ్చాడట.