ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా వరుస మూవీ ఆఫర్లను సొంతం చేసుకున్న మోహన్ బాబు ఇప్పుడు మాత్రం వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు.మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా గతేడాది థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
శాకుంతలం సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా సీనియర్ నటి ఝాన్సీ మోహన్ బాబు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.
సినిమాలు తీయాలని ఎవరైనా చెబితే సినిమాలు తీయవద్దని నష్టపోతామని చెప్పే నేను అనుకోకుండా సినిమా తీశానని ఆమె తెలిపారు.టైమ్ బాలేక డబ్బులు పోయానని ఆమె అన్నారు.
ఖైదీ ఇన్ స్పెక్టర్ సినిమా వల్ల ఆర్థికంగా భారీ స్థాయిలో నష్టపోయానని సీనియర్ నటి ఝాన్సీ చెప్పుకొచ్చారు.

సుమన్, రంభ, మహేశ్వరి ఆ సినిమాలో నటించారని ఆ సినిమా బాగున్నా డబ్బులు రాలేదని ఆమె పేర్కొన్నారు.నా భర్తకు సినిమా ఫీల్డ్ తో సంబంధం లేదని ఝాన్సీ కామెంట్లు చేశారు.నాది లవ్ మ్యారేజ్ అని కెమికల్స్ బిజినెస్ చేసేవాళ్లమని ఆమె తెలిపారు.
ఆస్తులు పోగొట్టుకున్నానని గుర్తుకొస్తే బాధేస్తుందని ఝాన్సీ అన్నారు.మా పిల్లల సంపాదన వాళ్లకే సరిపోతుందని ఝాన్సీ పేర్కొన్నారు.

నేను ఉంటున్న రూమ్ రెంట్ 7,000 రూపాయలు అని ఆమె తెలిపారు.మా ఆయన చనిపోయిన సమయంలో ఎక్కువగా బాధపడ్డానని ఝాన్సీ అన్నారు.బి.గోపాల్ డైరెక్షన్ లో ఒక సినిమాకు మోహన్ బాబును అనుకోగా ఆయన 90 లక్షలు, కోటి రూపాయలు తీసుకుంటున్నానని చెప్పారని ఆ మొత్తం విషయంలో వెనక్కి తగ్గామని ఝాన్సీ పేర్కొన్నారు.మోహన్ బాబుకు మార్కెట్ లేదని భావించి వెనక్కు తగ్గినట్టు ఆమె చెప్పుకొచ్చారు.