అంబానీ బ్రదర్స్‌కు షాకిచ్చిన సెబీ.. భారీగా వడ్డించింది ఫైన్.. !

తప్పు చేసిన వారికి జరిమాన విధించడం కామనే.కానీ వ్యాపార రంగాన్ని శాసిస్తున్న అంబానీ ఫ్యామిలీకి విధించిన జరిమాన ఎంతో చూస్తే కళ్లు తిరగడం ఖాయం.

 Sebi Shocks Ambani Brothers Imposed 25 Crores Fine , Sebi, Shocks, Ambani Brothe-TeluguStop.com

అదీ కూడా సుమారుగా 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలో.

టేకోవర్ లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేల్చిన సెబీ, 2000 సంవత్సరంలో జరిగిన డీల్ లో 5 శాతం వాటా చేతులు మారగా, దీనికి సంబంధించి సంస్థ ప్రమోటర్లు వివరాలు అందించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ అంబానీ సోదరులు, వారి భార్యలు నీతా అంబానీ, టీనా అంబానీలతో పాటు మరికొన్ని కంపెనీలపైనా జరిమానా విధిస్తున్నట్టు వెల్లడించింది.

Telugu Ambani Brothers, Ambani, Fine, Fineambani, Mukesh Ambani, Neeta Ambani, R

ఇంతకు ఈ జరిమాన విలువ ఎంతనుకుంటున్నారు.పదో పరకో కాదు.ఏకంగా రూ.25 కోట్లట.అంబానీ ఫ్యామిలీ అంటే అ మాత్రం భరించవలసిందే కదా.ఇకపోతే 2000 సంవత్సరంలో 6.83 శాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఆర్ఐఎల్ ప్రమోటర్లు, పీఏసీ వారంట్లతో కూడిన రిడీమబుల్ డిబెంచర్ల ద్వారా సొంతం చేసుకున్న ఈ సంస్ద ఈ వాటాల బదిలీ వివరాలను అదే సంవత్సరం జనవరి 7న ప్రకటించాల్సి ఉండగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదట.అందుకే ఈ పెద్ద మొత్తంలో ఫైన్ విధించినట్లు సెబీ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube