ముస్లిం సంచార జాతీయ ఆత్మీయ సమ్మేళనం తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు పై సజ్జల సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని.ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని.చంద్రబాబు మోసాలపై ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మందికి పింఛన్లు ఇస్తే.జగన్ అధికారంలోకి వచ్చాక 60 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

చంద్రబాబు తన హయాంలో మూడు లక్షల కోట్ల అప్పులు చేశారని కానీ జగన్ మాత్రం వివిధ పథకాల రూపంలో.లబ్ధిదారుల ఖాతాలో కి లక్షల కోట్లు జమ చేస్తున్నారని పేర్కొన్నారు.చంద్రబాబు హయాంలో దోపిడీ పాలన సాగితే నేడు పారదర్శక పాలన రాష్ట్రంలో జరుగుతుందని.
ప్రభుత్వ పథకాల రూపంలో ప్రజలకు మేలు జరుగుతుంటే చంద్రబాబు అనుకూల మీడియా ఓర్వలేక పోతుందని.విష ప్రచారం చేస్తుందని అటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.చంద్రబాబు మాదిరి మోసాలు చేయటం కుట్రలు కుతంత్రాలు…సీఎం జగన్ కి తెలియవని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి.
చదువు భారం కాకూడదని సీఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నట్లు, వైద్యం కూడా పేద వాళ్లకు భారం కాకుండా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.