ఏపీలో సీఎం జగన్, ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు పోరుకు సుధీర్ఘ చరిత్ర ఉంది.కానీ, రాజకాయాల్లో ఏ రోజుకారోజు అన్నట్టు పరిస్థితులు మారిపోతుంటాయి.
పైకి ఎలా కనిపించినా లోలోపల మాత్రం ఎత్తుకుపైఎత్తులతో వ్యూహాలు రచిస్తుంటారు.అయితే 2024 ఎన్నికల నాటికి రాజకీయాలు మరింత వేడెక్కేట్టు కనిపిస్తున్నాయి.
అందుకే ఇప్పటి నుంచే సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.ఇదే కోవలో టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి గెలుపు గుర్రం ఎక్కేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగించే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది.బాబు దొరికిన ఏ అంశాన్ని వదలడం లేదు.
ఇదే క్రమంలో వైఎస్ వివేకా దారుణ హత్య విషయంలో సీబీఐ దూకుడు పెంచడం.కీలక వ్యక్తుల వాంగ్మూలాలు ఇలా అన్నీ టీడీపీకి కలిసొచ్చే అంశాలుగా మారుతున్నాయి.
దీంతో టీడీపీ తన పొలిటికల్ గేమ్‌ను మార్చేసే పనిలో పడినట్టు సమాచారం.
అయితే వైసీపీని టార్గెట్ చేస్తూ వచ్చిన టీడీపీ తాజాగా జగన్ క్యారెక్టర్ పైనే గురిపెట్టింది.
ఆయన వ్యక్తిత్వాన్ని పట్టుకుని దెబ్బకొట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకవిధంగా చెప్పాలంటే 2009 నుంచే ఆ ప్రయత్నం మొదలెట్టారు.
జగన్ ఆర్థిక నేరాలు అంతాఇంతా కాదని, సిబీఐ కేసులు ఉన్నాయని, జగన్ పెద్ద అవినీతి కోరు అంటూ ఏపీ వాడవాడలో ఊదరగొట్టి వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేసిన విషయం విధితమే.కాగా అవినీతిపై ఎంత వాదించినా టీడీపీకి ఆవగింజంత లాభం కూడా జరగలేదు.
జగన్‌ది క్రిమినల్ మైండ్ అంటూ మరో కొత్త ప్రచారానికి టీడీపీ తెరలేపింది.ఫ్యాక్షన్ మెంటాలిటీ అంటూ ఇబ్బందులు పెట్టే పనిలో టీడీపీ ఉంది.
మెంటాలిటీ అని కూడా ఆరోపణలు చేస్తూ వచ్చింది.అయినా టీడీపీకి రాజకీయంగా ఒరిగిందేమీ లేదు.

తాజాగా వివేకా హత్య విషయంలో వెలుగు చూస్తున్న వాంగ్మూలాలతో వైసీపీ ఇరకాటంలో పడింది.ఇవే వాంగ్మూలాలను టీడీపీ అస్త్రాలుగా మలుచుకుని వైసీపీని భూస్తాపితం చేసేందుకు వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం.ఈక్రమంలోనే జగన్ నైతికంగా పతనం అయ్యారంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు కూడా.ఇలా జగన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు టీడీపీ భారీ స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది.వివేకా హత్య కేసులో ఏకంగా సీబీఐ విచారణ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బొండా ఉమామహేశ్వరరావు స్పందిస్తూ తమిళనాడు నాటి సీఎం జయలలితను విచారించినట్టు జగన్‌ను కూడా విచారించాలంటూ పట్టుబడుతున్నాడు.మొత్తంగా వివేకా కేసును జగన్‌కు అంటకట్టి జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలని టీడీపీ వ్యూహం రచిస్తోందని సమాచారం.కాగా సీబీఐ ఏమి చేస్తుందన్న దానికంటే టీడీపీ చేస్తున్న హవా మాత్రం వైసీపీని ఇరకాటంలో పెట్టేలా ఉంది.
రానురాను టీడీపీ వ్యూహం ఫలిస్తుందా.బెడిసికొడుతుందా.? అంటే వేచి చూడాల్సిందే.