జగన్‌కు అద్భుతమైన సలహా ఇచ్చిన కేశినేని నాని

చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతిని అలాగే కొనసాగించలేక, అలాగని పూర్తిగా వదిలేయలేక మూడు రాజధానులు అనే ఓ కొత్త కాన్సెప్ట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెరపైకి తెచ్చారు.

రాజధానిపై స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను అని కూడా ఈ సందర్భంగా జగన్‌ అన్నారు.

కానీ దీనివల్ల మరిన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

అసలు ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్‌కు మూలమైన సౌతాప్రికానే ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటే.జగన్‌ ఆ దేశాన్ని ఉదాహరణగా చూపించి ఏపీకి ప్రతిపాదించడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని.

జగన్‌పై విరుచుకుపడ్డారు.అమరావతిలో అభివృద్ధిని చూపించలేక ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Advertisement

అంతేకాదు జగన్‌కు ఓ సలహా కూడా ఇచ్చారు.అంతగా కావాలనుకుంటే.

అమరావతికి దీటుగా మరో నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని సూచించారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమదూరంలో ఉంటుంది కాబట్టే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని చెప్పారు.

ఇప్పుడు దీనిని మూడు భాగాలు చేయడం వల్ల సమయం, ఖర్చు వృథా అవడం తప్ప ఒరిగేదేమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఈ మూడు రాజధానుల ప్రతిపాదన విన్న తర్వాత దేశమంతా ఏపీని చూసి నవ్వుతోందని కేశినేని చెప్పారు.చంద్రబాబు ఊహించినంత గొప్ప రాజధాని కాకపోయినా.ఉన్నదానిని ఎలాగోలా పూర్తి చేసి అమరావతిలోనే కొనసాగించాలని ఆయన సూచించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

కర్నూలులో కేవలం హైకోర్టు పెట్టినంత మాత్రాన ఏం అభివృద్ధి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు