Etela Rajendar: బిజెపి అధికారంలోకి వస్తే వారికి రైతుబంధు కట్..!

కేసీఆర్ (Kcr) పాలనలో రాష్ట్రమంతా అప్పుల పాలు అయిందని బిజెపి నేత ఈటల రాజేందర్(Etela Rajender) అన్నారు.సోమవారం హనుమకొండలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన కామెంట్లు చేశారు.

 Rythu Bandhu Will Be Cut If Bjp Comes To Power Says Etela Rajendar-TeluguStop.com

కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల పాలవుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడుతామని అన్నారు.పేద ప్రజలను మద్యానికి బానిసలను చేస్తున్నారని, ఆ డబ్బులతో వారి ఆస్తులను పెంచుకుంటున్నారని తెలియజేశారు.

పథకాల పేరుతో కేవలం రూ.25 వేలకోట్లే ఖర్చు చేస్తున్నారని , మద్యం ద్వారా సంవత్సర కాలంలో రూ.45 వేల కోట్లు వస్తుందని తెలిపారు.పేదలకు మద్యం తాగించి వచ్చే డబ్బులను వారి కోసం మాత్రమే వాడుకుంటున్నారని, కేసీఆర్ (Kcr) కు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నాడని అన్నారు.

Telugu Brs, Cm Kcr, Doublebedroom, Etela Rajender, Hanumakonda, Rythu Bandhu, Ry

రాబోయేది బిజెపి (BJP) ప్రభుత్వమేనని, బిజెపి గద్దెనెక్కిన వెంటనే ప్రతి ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పింఛన్లు అందిస్తామన్నారు.రైతుబంధు (Rythu Bandhu) వందలాది ఎకరాలు ఉన్నటువంటి సంపన్నులకు అవసరం లేదని , మేము అధికారంలోకి రాగానే ధనవంతులకు రైతుబంధు, రైతు భీమా (Rythu Bheema) కట్ చేస్తామని, పేద ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ ఏమైందని ప్రశ్నించారు.

Telugu Brs, Cm Kcr, Doublebedroom, Etela Rajender, Hanumakonda, Rythu Bandhu, Ry

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి జోష్ తగ్గిందన్న వార్తల్లో నిజం లేదని, కొన్ని మీడియా సంస్థలు కావాలనే ప్రచారం చేస్తున్నాయని తెలియజేశారు.ఎలాగైనా రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ (Kcr) ను గద్దె దించుతామని, దీనికోసం బిజెపి దశలవారీగా ఆందోళన చేస్తుందని ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు.ఇల్లు లేకుండా పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ సర్కార్ ను డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube