ఈ జన్మలో వెంకటేష్ లాంటి హీరోతో సినిమా చేయనంటున్న తేజ..ఎందుకు ?

విక్టరీ ని తన ఇంటి పేరుగా మార్చుకొని, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మినిమమ్ గ్యారంటీ హీరో గా నిలిచాడు వెంకటేష్.సినిమా టాక్ ఎలా ఉన్న కూడా వెంకటేష్ చిత్రాలకు అభిమానులు ఉంటారు.

 Teja Hurt About Venkatesh Decision, Venkatesh,director Teja,tollywood,teja Movi-TeluguStop.com

ఆయన ఒక్క జెనరేషన్ వెనక్కి వెళితే ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్డ్రస్ గా ఉండేవారు.అందువల్లే అయన చిత్రాలకు టాక్ బాగోలేకున్నా వసూళ్లకు డోకా ఉండదు.

అంతెందుకు అండి ఒకవేళ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మినిమమ్ గ్యారంటీ హీరోల లిస్ట్ లో వెంకటేష్ పేరు ముందు వరసలో ఉంటుంది.మరి ఇలాంటి ఒక హీరోతో సినిమా తీయాలని ఏ దర్శకుడు అయినా కోరుకుంటాడు.

అవకాశం వస్తే తానేంటో నిరూపించుకోవాలని చూస్తాడు.

Telugu Teja, Rumors, Tollywood, Venkatesh-Movie

కానీ తెలుగు ఇండస్ట్రీ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న తేజ మాత్రం అందుకు సిద్ధంగా లేదట.చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో తెలుగు సినిమాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన తేజ వెంకటేష్( Venkatesh ) వంటి హీరోతో మాత్రం సినిమా చేయడానికి రెడీ గా లేడట.అందుకు గల కారణం వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాకు తేజను దర్శకుడిగా పెట్టుకుంటాను అని మాట ఇచ్చాడట.

ఆ మాట నెరవేర్చుకోక పోవడం తో వెంకటేష్ పై విపరీతమైన కోపం పెట్టుకున్నాడు తేజ.అందుకే వెంకటేష్ తో ఈ జన్మలో సినిమా తీయను అంటూ చెప్తున్నాడు.ఈ మాత్రం దానికే ఇలా ఫీల్ అయిపోతే ఆలా అంటూ వెంకటేష్ అభిమానులు సైతం తేజ( Director Teja ) పై సెటైర్స్ వేస్తున్నారు.

Telugu Teja, Rumors, Tollywood, Venkatesh-Movie

సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి.ఇంత కామన్ విషయానికి యూట్యూబ్ ఛానెల్స్( YouTube Channels ) లో ఇంటర్వూస్ ఇవ్వడం ఏంటి అంటున్నారు.పైగా వెంకటేష్ కూడా ఎవరిని అంత ఈజీ గా హర్ట్ చేయడు.

మరి తేజ కు సినిమా ఇవ్వకపోవడానికి కారణం ఎదో ఒకటి ఉండి ఉండవచ్చు అని అంతా అనుకుంటున్నారు.ఇక తేజ కూడా ఫామ్ లో లేడు.ఫామ్ లో లేని డైరెక్టర్ చేతిలో సినిమా పెట్టడానికి వెంకటేష్ ఏం కొత్త హీరో కాదు కదా.చివరి నిముషం లో సైతం హీరోను మార్చగలిగే సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న విషయాలకు హర్ట్ అయితే చాలా కష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube