38-42 డిగ్రీలు.ఇది సగటున రోజూ హైదరాబాద్ లో ఉంటున్న టెంపరేచర్.
వేసవిలో పల్లెటూరిలో ఉంటేనే మేలండి, చెట్ల కింద కూర్చుంటే ప్రకృతి చల్లదానాన్ని ఇస్తుంది.సీటిల్లో ఉన్నవారికి ఏసి ఉంది కదా అని తెలిగ్గా తీసిపారేయకండి .ఎక్కువసేపు ఏసిలో ఉండటం ఏమైనా మంచి విషయామా? అయినా వేడిని బయట నుంచి తగ్గిస్తే సరిపోదు .లోపలినుంచి తరిమెయ్యాలి.సమస్యలను లోపటినుంచి కూడా పోరాడాలి.అందుకే దానిమ్మని ఇంట్లో మెయింటేన్ చేయండి.ఇది అద్భుతమైన న్యూట్రింట్స్ ని కలిగి ఉంటుంది.మీకు శక్తిని, హైడ్రేషన్ ని అందిస్తుంది.
అందుకోసమే 5 అద్భుతమైన దానిమ్మ జ్యూసులు మీకోసం.ఇవి ఈ ఎండకాలం పొడవునా రకరకాల సమస్యలు తీర్చి చల్లదాన్నాన్ని ఇస్తాయి.
మరి ఆ జ్యూసులు ఏంటో, అవి ఎలా తయారుచేయాలో చూద్దామా ?
#1.నిమ్మ – దానిమ్మ జ్యూస్ :
ఒక్క గ్లాసులో దానిమ్మ రసాన్ని పిండితే, అందులో రెండు నిమ్మకాయలు పిండండి.చక్కెర అవసరం లేదు కాని, తప్పదు అనుకుంటే చాలా తక్కువగా వేసుకోండి.ఇది వెంటనే మిమ్మల్ని హైడ్రేట్ చేస్తుంది.
దానిమ్మలో ఉండే పొటాషియం వాటర్ బ్యాలెన్స్ మెయింటేన్ చేస్తుంది, శరీరాన్ని ఊరికే అలసిపోనివ్వదు.వేసవి మండుటెండల్లో మీకు కావాల్సింది ఇదేగా?
# 2.దానిమ్మ – పుదీనా జ్యూస్ :
పుదీనాకి క్లీన్సెనర్ అనే పేరు ఉంది.ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా, దుమ్ముధూళి, ఆయిల్, చెమటతో ఇబ్బందిపెట్టే వేసవిలో.ఇక దానిమ్మ ఎలాగో అందాన్ని కాపాడుతుంది.కాబట్టి దానిమ్మ – పుదీనా జ్యూస్ వేసవిలో చర్మ ఆరోగ్యానికి పనికివస్తుంది.మీ రుచిని బట్టి దానిమ్మ రసంలో ఎంత పుదీనా రసం వేస్తారో మీ ఇష్టం.
చెక్కర లేకుండా తాగితే మంచిది.
# 3.దానిమ్మ – బీట్ రూట్ జ్యూస్:
గ్లాసెడు దానిమ్మ రసంలో, 1/4 బీట్ రూట్ జ్యూస్ కలిపి, చల్లదానానికి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి.డిఫరెంట్ రుచి కోసం కొంచెం నిమ్మరసం కలిపినా ఇబ్బందేమి లేదు.ఇక ఈ ఈ జ్యూస్ ఎందుకంటే, ఎండకాలంలో ఎన్నోరకాల సమస్యలతో శరీరం పోరాడాలంటే దాని రోగనిరోధకశక్తి పెరగాలి.దానిమ్మ – బీట్ రూట్ లో ఉండే యాంటిఆక్సిడెంట్స్ మీ రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
#4.దానిమ్మ – పుచ్చకాయ జ్యూస్ :
ఈ వేసవిలో మనకి కావాల్సింది చల్లదానాన్ని ఇచ్చే ద్రవపదార్థాలు.అందులోనూ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి కావాలి.పుచ్చకాయలో 96% వాటర్ కంటెంట్ ఉంటుంది.
అందుకే ఈ సీజన్ లో దానికంత డిమాండ్.ఇక దానిమ్మలోని మినరల్స్ కి పుచ్చకాయలోని వాటర్ కంటెంట్ కలిస్తే, వేసవిలో శరీరానికి ఇంకేం కావాలి? అందుక ఒక గ్లాసులో సగం దానిమ్మ, సగం పుచ్చకాయ ఉండేలా జ్యూస్ తయారుచేసుకోండి.
# 5.దానిమ్మ – తేనే జ్యూస్ :
వేసవిలో మెటాబాలిజం రేటులో అవకతవకల వలన జీర్ణ సమస్యలు, మనం తీసుకునే ఆహారం వలన కోలెస్టిరాల్ సమస్యలు, చివరకి హైబీపీ సమస్యలు కూడా ఎక్కువగానే చూస్తుంటాం.అలాగే దురద సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది.ఈ సమస్యలన్నిటికి ఒకే సమాధానం దానిమ్మ తేనె జ్యూస్.
షుగర్ వేయాల్సిన అవసరం లేకపోవడంతో ఇంకా మిగితా జ్యూసులకంటే ఆరోగ్యకరం.గ్లాసెడు దానిమ్మరసంలో 1/4 తేనే ఉండేలా చూసుకోండి.