తెలుగు తెరపై క్రేజీ కాంబో.. ఎన్టీఆర్ తో జోడీ కట్టనున్న సాయి పల్లవి?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

 Rowdy Baby Sai Pallavi To Share Screen With Jr.ntr, Sai Pallavi, Jr.ntr, Koratal-TeluguStop.com

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదర గొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి.కొరటాల ఇటీవలే మెగా హీరోలతో ఆచార్య సినిమా తీసి ప్లాప్ ఎదుర్కొన్నాడు.

తన కెరీర్ లో మొదటిసారి ప్లాప్ అయ్యింది.

దీంతో ఇప్పుడు మరింత పట్టుదలతో కొరటాల ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటించే హీరోయిన్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఎన్టీఆర్ కు జోడీగా క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి నటించనుందని తాజాగా వార్తలు వస్తున్నాయి.

ఇదే నిజం అయితే ఎలా ఉంటుందో అప్పుడే ఫ్యాన్స్ ఉహించు కోవడం కూడా మొదలు పెట్టారు.

Telugu Acharya, Jr Ntr, Koratala Shiva, Rowdybaby, Sai Pallavi-Movie

సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ తర్వాత ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదు.దీంతో ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పిందని, పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.కానీ ఈమెకు మంచి కథ సెట్ అవ్వక పోవడం వల్లనే మరో సినిమా ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది.అయితే తాజాగా ఎన్టీఆర్ తో ఈ అమ్మడు జోడీ కట్టబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.వీరిద్దరూ జోడీ కడితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కూడా ఆశ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube