అర్ధరాత్రి పార్సిల్ డెలివరీ చేస్తున్న యువకుడు.. పోలీసులు చేసిన పనికి సలాం కొట్టాల్సిందే

పోలీసులు అనగానే అందరికీ ఏదో ఒక భయం.ఖాకీ చొక్కా చూడగానే ఏదో ఒక ఫీలింగ్.

 Indore Police Gifts Bike To Zomato Food Delivery Boy Delivering Food On Cycle De-TeluguStop.com

అయితే అది నాణానికి ఒకవైపు మాత్రమే.తోటి స్నేహితులు చక్కగా ఇదే ఎనిమిది గంటల ఉద్యోగం చేసుకుంటుంటే, వాళ్లు మాత్రం 24 గంటలూ డ్యూటీ చేయాల్సిందే.

విధి నిర్వహణలో అన్ని వర్గాలనూ సంతృప్తి పరచాల్సిందే.కానీ తామూ అందరిలాంటి మనుషులమేనని.

తమకు కూడా ఇతరుల పట్ల జాలి, దయ ఉంటాయని మధ్యప్రదేశ్ పోలీసులు నిరూపించారు.చెమటలు కార్చుతూ సైకిల్‌ తొక్కుతూ ఫుడ్‌ డెలివరీ చేస్తున్న ఒక వ్యక్తికి బైక్‌ కొనిచ్చి మానవత్వం చాటుకున్నారు పోలీసులు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ లో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.

ఇండోర్‌(Indore)కి చెందిన జే హాల్డే(22) నిరుపేద కుటుంబంలో జన్మించాడు.కుటుంబ పోషణ కోసం అతడు జొమాటో ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌ గా పని చేస్తున్నాడు.

పేదరికం కారణంగా బైక్ కొనుక్కొనే స్థోమత లేదు.దీంతో మండే చెమటలు కార్చుతూ సైకిల్‌ తొక్కుతూ ఫుడ్‌ డెలివరీ చేస్తున్నాడు.

దీంతో అతడిని ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నాడు.తన ఆర్థిక పరిస్థితి గురించి జే హాల్డే పోలీసులకు వివరించాడు.

దీంతో చలించిపోయిన తహజీబ్.అతడికి బైక్ కొనుక్కోడానికి సాయం చేయాలని నిర్ణయించారు.

దీంతో మానవత్వంతో హాల్డేను ఆదుకునేందుకు విజయ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ముందుకు వచ్చారు.వారందరూ కలిసి రూ.32,000 కలెక్ట్‌ చేశారు.ఒక ఆటోమొబైల్‌ షో రూమ్‌లో డౌన్ పేమెంట్, మొదటి రుణ వాయిదా చెల్లించి ఒక బైక్‌ కొనుగోలు చేశారు.

Telugu Cycle, Delivery, Gifts Bike, Indore, Madhya Pradesh, Time, Latest, Zay Ha

పోలీసులు తనకు చేసిన సహాయానికి జే హాల్డే కృతజ్ఞతలు తెలిపాడు.ద్విచక్రవాహనానికి డౌన్ పేమెంట్ కడితే చాలని, ఈఎంఐలు తానే కట్టుకుంటానని పోలీసులకు చెప్పినట్లు హాల్దే వివరించాడు.గతంలో తాను సైకిల్ మీద కేవలం 6- 8 డెలివరీలు చేసేవాడినని.ఇప్పుడు బైక్ మీద రాత్రి పూట 15 నుంచి 20 డెలివరీలు చేస్తున్నానని హాల్దే చెప్పుకొచ్చాడు.

లోన్ తీసుకునే పరిస్థితి లేకపోవడంతో బైక్ కొనలేకపోయినట్టు చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube