ఫుట్‌పాత్‌లకు చక్కటి పరిష్కారం 'రూఫ్ టాప్ వాక్'

ఏవైనా ప్రధాన నగరాల్లో మనం తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి నడవడానికి దారి ఉండదు.ఫుట్‌పాత్‌లన్నీ వివిధ వ్యాపారాలతో నిండిపోయి కనిపిస్తాయి.

 Roof Top Walk Is A Great Solution For Footpaths, Roof Top Walk, Viral Latest, Ne-TeluguStop.com

కొన్ని చోట్ల అసలు ఫుట్ పాత్ కనిపించదు.దీంతో నడక మార్గంలో వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తలెత్తుతాయి.

అయితే విదేశాల్లో దీనికి చక్కటి పరిష్కారం కనుగొన్నారు.రూఫ్ టాప్ వాక్‌ను ఫుట్‌పాత్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని అమలు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

నగరాల్లో ఫుట్‌పాత్ సమస్యకు రోటర్‌డ్యామ్ రూఫ్‌టాప్ డేస్ అనే కంపెనీ చక్కటి పరిష్కారం సూచించింది.‘రోటర్‌డ్యామ్ రూఫ్‌టాప్ వాక్’ అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది.ఇందులో భాగంగా నగరాల్లో చాలా మంది ఇళ్ల డాబాపై భాగాలను వినియోగించరు.

అవన్నీ నిరుపయోగంగా ఉంటాయి.అలాంటి వాటిని కూడా ఉపయోగంలోకి తెచ్చి, ఫుట్ పాత్ సమస్యకు పరిష్కారం చూపడమే ఈ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం.

ఇది నగరాలను మరింత నివాసయోగ్యంగా, జీవ వైవిధ్యంగా చేయడమే దీని ముఖ్య ఉద్దేశంగా కంపెనీ చెబుతోంది.రూఫ్‌టాప్ ప్రోగ్రామ్‌లను అమలు చేయడం వల్ల వాతావరణ మార్పు, గృహ సంక్షోభం, పునరుత్పాదక శక్తికి మారడం వంటి ప్రధాన పర్యావరణ, సామాజిక సమస్యలపై వెలుగునిస్తుంది.

Telugu Roof Top Walk, Rotterdam, Rotterdamroof, Latest-Latest News - Telugu

ఉపయోగించని ఖాళీ ఫ్లాట్ రూఫ్‌లను ఇందులో వినియోగిస్తారు.రోటర్‌డ్యామ్ యొక్క ఖాళీ ఫ్లాట్ రూఫ్‌లను ఉపయోగించుకోవడానికి 130 వినూత్న ఆలోచనల జాబితాను కూడా ఎమ్‌వీఆర్‌డీవీ రూపొందించింది.ఈ నెల ప్రారంభంలో ఎమ్‌వీఆర్‌డీవీ, ఫుగ్గర్ ఫౌండేషన్ ప్రపంచంలోని అత్యంత పురాతన గృహ సముదాయమైన ఫుగ్గేరీ సోషల్ హౌసింగ్ ప్రాజెక్ట్ యొక్క 500వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి.ఇందులో టెంపరరీ స్కాఫ్‌ఫోల్డింగ్ పద్ధతిలో 30 మీటర్ల వాక్ వే 98 అడుగుల ఎత్తులో ఉంటుంది.

దాదాపు సందర్శకులు 600 మీ నడక మార్గంలా ఇది ఉపయోగపడుతుంది.దీంతో రద్దీగా ఉండే వీధులను దాటుతారు.ఈ మార్గంలో ఆర్కిటెక్టులు వివిధ డిజైన్లు మొదలు పెట్టొచ్చు.ఫుడ్ ప్రొడక్టుల స్టాళ్లు వంటి పెట్టుకోవచ్చు.

చాలా నగరాల్లో ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube