కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఎక్కడికి అక్కడ నిలిచి పోయింది.హాలీవుడ్ నుండి గల్లీ మూవీస్ వరకు అన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి.
ఒకవేళ షూటింగ్ చేసినా కూడా చాలా జాగ్రత్తల మద్య ఎన్నో ముందస్తు చర్యలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు.వారంలో మూడు నాలుగు రోజులు మాత్రమే షూటింగ్స్ చేస్తున్నారు.
ఆమద్య ఒక హాలీవుడ్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యిందంటూ ప్రచారం జరిగింది.అయితే ఆ షూటింగ్‌ను కూడా నిలిపేశారట.
ఇక బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్స్ జరుపుకోవడం లేదు.ఒకటి రెండు సినిమాలు మినహా పెద్ద హీరోలు ఎవరు ముందుకు రావడం లేదు.అయితే సీరియల్స్ మరియు వెబ్ సిరీస్ లకు సంబంధించిన షూటింగ్స్ మాత్రం జరుగుతున్నాయి.ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వరుసగా సినిమాలు చేయడం, వాటిని విడుదల చేయడం కేవలం వర్మకే చెల్లింది.
ఈ కరోనా టైంలోనే అతడు క్లైమాక్స్, నగ్నం చిత్రాలను తీసుకు వచ్చాడు.ఇంకా థ్రిల్లర్, పవర్ స్టార్, మర్డర్ చిత్రాలను చేస్తున్నాడు.
కరోనా వైరస్ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేశాడు.ఇక లాక్ డౌన్ సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు.
చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్ని అన్ని కూడా వర్మ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాడు.ఈ సమయంలో ఏ ఫిల్మ్ మేకర్ కూడా మరీ ఇంత యాక్టివ్‌గా సినిమాలు చేసి ఉండడు.
ఇంతగా ఆదాయాన్ని పొంది ఉండడు.వర్మ ఈ విషయంలో ఖచ్చితంగా ప్రపంచ రికార్డుకు అర్హుడు అంటూ ఆయన శిష్యులు మరియు అభిమానులు అంటున్నారు.
ముందు ముందు ఈ విషయాన్ని ప్రపంచ రికార్డుల్లో భద్రపర్చుతారేమో చూడాలి.