ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో వేణుగోపాల్ రెడ్డి( Venugopal Reddy ) తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )పేరును ప్రకటించడం జరిగింది.సీఎల్పీ సమావేశంలో నాయకులంతా తీసుకున్న నిర్ణయం బట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో సీఎం ప్రకటన తర్వాత రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే( AICC President Kharge ).అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ఇన్ ఛార్జ్ జనరల్ సెక్రెటరీ మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ క్రమంలో సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు.అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించిన గాని.రెండుసార్లు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమిపాలైంది.అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం జరిగింది.సీనియర్ నాయకులంతా ఏకతాటిపైకి రావటంతో పాటు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సమర్థవంతమైన నాయకత్వం వహించటంతో.ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.
దీంతో తెలంగాణలో పదేళ్ల కాంగ్రెస్ నిరీక్షణకు రేవంత్ తెరదించినట్లు అయింది.