మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించడం జరిగింది.సీఎల్పీ సమావేశంలో నాయకులు ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటన తర్వాత ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం తెలిసిందే.ఈ క్రమంలో ఢిల్లీలో పార్టీ పెద్దలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరి కొంతమంది జాతీయ నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా ఆహ్వానించడం జరిగింది.అనంతరం మంత్రివర్గ కూర్పుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు టాక్రేతో భేటీ అయ్యారు.ఈ రకంగా బుధవారం అంత ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన రేవంత్ రెడ్డి సాయంత్రం మాణిక్ రావు టాక్రేతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి చేరుకున్నారు.అనంతరం మాణిక్ రావు టాక్రే నేరుగా ఎమ్మెల్యేలు బస చేస్తున్న ఎల్లా హోటల్ కు వెళ్లి వారితో సమావేశం కాబోతున్నారు.
ఇదిలా ఉంటే గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 01:04 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నట్లు సమాచారం.